ఈసారి పెద్దగా బాధ లేదు: రకుల్

షూటింగ్స్ ఆగిపోవడం, సినిమా విడుదలలు వాయిదా పడడం లాంటివి ఈసారి తనను అంతగా బాధపెట్టడం లేదంటోంది రకుల్ ప్రీత్. గతేడాది తన సినిమాల షూటింగ్స్ ఆగిపోయినప్పుడు బాధ అనిపించిందని, కానీ ఈసారి మాత్రం షూటింగ్స్…

షూటింగ్స్ ఆగిపోవడం, సినిమా విడుదలలు వాయిదా పడడం లాంటివి ఈసారి తనను అంతగా బాధపెట్టడం లేదంటోంది రకుల్ ప్రీత్. గతేడాది తన సినిమాల షూటింగ్స్ ఆగిపోయినప్పుడు బాధ అనిపించిందని, కానీ ఈసారి మాత్రం షూటింగ్స్ ఆపేసి ఇంట్లో కూర్చోవడానికి ఇబ్బంది పడడం లేదని చెప్పుకొచ్చింది.

బయట డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న సామాన్య జనం, చిన్న చిన్న వ్యాపారాలు మూతపడడం లాంటి వాటితో పోలిస్తే.. తనకు ఎదురైన ఇబ్బంది చాలా చిన్నదని అంటోంది రకుల్. మొత్తం వ్యవస్థే లేట్ గా నడుస్తున్నప్పుడు మనం బాధపడ్డంతో ప్రయోజనం లేదంటోంది.

ఇక కరోనాపై స్పందిస్తూ.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. ప్రజల నిర్లక్ష్యం వల్లనే వైరస్ వ్యాప్తి ఎక్కువైందనే వాదనను ఖండిస్తోంది ఈ బ్యూటీ. తలరాత బాగాలేనప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరని.. తనకు తెలిసిన వాళ్లలో చాలామందికి జాగ్రత్తగా ఉన్నప్పటికీ, రెండోసారి కరోనా సోకడం బాధాకరమని అంటోంది.

మే 1 నుంచి డాక్టర్ జి అనే సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది రకుల్. కానీ కరోనా వల్ల ఆ షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం తన చేతిలో 7 సినిమాలున్నాయి.. ఏది ఎప్పుడు సెట్స్ పైకొస్తుందో, రిలీజ్ అవుతుందో చెప్పలేనని అంటోంది రకుల్.