ఓటిటి సినిమా ఓటీటీలో హిట్

నాగార్జున శ్రమ తీసుకుని విపరీతంగా పబ్లిసిటీ చేసిన సినిమా వైల్డ్ డాగ్. మరే సీనియర్ హీరో కూడా ఓ సినిమా ప్రచారం కోసం ఈ రేంజ్ లో కష్టపడడం ఇప్పటి వరకు జరగలేదు. అయితే…

నాగార్జున శ్రమ తీసుకుని విపరీతంగా పబ్లిసిటీ చేసిన సినిమా వైల్డ్ డాగ్. మరే సీనియర్ హీరో కూడా ఓ సినిమా ప్రచారం కోసం ఈ రేంజ్ లో కష్టపడడం ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఢమేల్ మనిపోయింది. 

జనాలు నాగ్ ను ఈ తరహా సినిమాల్లో చూడలేకపోయారని, అదే అడవి శేష్ లాంటి హీరో అయితే ఈ సినిమా ఓ రేంజ్ లో వుండి వుండేదని కామెంట్లు వినిపించాయి. 

వైల్డ్ డాగ్ సినిమా ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ల్లో ఎక్కువగా వచ్చే వెబ్ సిరీస్ లాంటి సినిమా. పక్కా వాటి లైన్ లోనే తయారు చేసారు. విడుదలకు ముందు నేరుగా ఓటిటికి ఇద్దాం అనుకున్నారు. 

కానీ మళ్లీ మనసు మార్చుకుని థియేటర్ లోకి తెచ్చారు. కానీ రెగ్యులర్ ఆడియన్స్ పక్కన పెట్టారు. పైగా వకీల్ సాబ్ విడుదల ప్రభావం కూడా వుండే వుంటుంది.

ఇప్పుడు వైల్డ్ డాగ్ నెట్ ఫ్లిక్స్ ఓటిటి లోకి వచ్చింది. అక్కడ బ్లాక్ బస్టర్ అయిందని వార్తలు బయటకు వచ్చేసాయి. అంటే ఇప్పుడు మేకర్లకు క్లారిటీ వచ్చి వుండాలి. 

ఓటిటి వెబ్ సిరీస్ ల లైన్ లో సినిమా తీస్తే అక్కడే విడుదల చేయాలి తప్ప, థియేటర్ కు తేకూడదు. ఎక్కడి ఆడియన్స్ అక్కడే చూస్తారు అని.