కొరటాల పై దిల్ రాజు గురి?

కొరటాల…టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరు. దిల్ రాజు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరు. ఇంకా చెప్పాలంటే కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. అంతకు మించి.  Advertisement ఈ ఇద్దరికి పొసగడం లేదన్న టాలీవుడ్ ఇన్…

కొరటాల…టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరు. దిల్ రాజు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరు. ఇంకా చెప్పాలంటే కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. అంతకు మించి. 

ఈ ఇద్దరికి పొసగడం లేదన్న టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో నికార్సుగా వినిపించే వాస్తవం. అందుకే ఆచార్య సినిమా నైజాం రైట్స్ ను కొరటాల శివ పట్టుపట్టి వేరే డిస్ట్రిబ్యూటర్ కు అందించారు అన్నది టాక్. అయితే ఇప్పుడు ఈ విషయంలో దిల్ రాజు సైలంట్ గా వుండబోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. 

సినిమా విడుదల టైమ్ లో దిల్ రాజు ఓ విషయాన్ని చాంబర్ దృష్టికి తీసుకెళ్తారని బోగట్టా.ఇంతకీ అదేంటీ అంటే భరత్ అనే నేను సినిమా విషయంలో దిల్ రాజుకు వెనక్కు రావాల్సిన మూడు కోట్ల మొత్తం అని వినిపిస్తోంది.

భరత్ అనే నేను సినిమా మార్కెటింగ్ విషయాలు కూడా దర్శకుడు కొరటాల శివే చూసుకున్నారు. ఆయన టీమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చారు. అయితే అప్పట్లో టెర్మ్స్ బాగానే వున్నాయి కాబట్టి దిల్ రాజకు ఇచ్చారు. ఈ ఇవ్వడం కూడా దిల్ రాజుతో కొరటాల నే అగ్రిమెంట్ చేసినట్లు తెలుస్తోంది. 

నైజాం ఏరియాను నిర్మాత దానయ్య దగ్గర నుంచి కొరటాల తీసుకుని దిల్ రాజు దగ్గర పెట్టారో, అమ్మారో..మొత్తానికి సమ్ థింగ్ ఏదో జరిగింది. ఈ వ్యవహారంలో దిల్ రాజుకు మూడు కోట్లు వెనక్కు ఇవ్వాల్సి వుందని దిల్ రాజు సన్నిహిత వర్గాల బోగట్టా.

ఇప్పుడు ఆచార్య విడుదల టైమ్ లో తన బాకీ తనకు ఇప్పించాలని దిల్ రాజు కోరబోతున్నారని తెలుస్తోంది చిత్రమేమిటంటే ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు. అలాగే మెగాస్టార్ తో, రామ్ చరణ్ తో కూడా మంచి బంధాలు వున్నాయి. అందువల్ల ఈ వ్యవహారాన్ని దిల్ రాజు ఎలా డీల్ చేయబోతారో తెలియాలంటే ఆచార్య విడుదల వరకు ఆగాల్సిందే.