జాగ్రత్త.. ఈ 3 కూడా కరోనా లక్షణాలే!

గతేడాది కరోనా సోకిన ప్రారంభంలో దాని లక్షణాల్ని వైద్య నిపుణులు బయటపెట్టారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం లాంటివి కరోనా లక్షణాలుగా గుర్తించారు. Advertisement…

గతేడాది కరోనా సోకిన ప్రారంభంలో దాని లక్షణాల్ని వైద్య నిపుణులు బయటపెట్టారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం లాంటివి కరోనా లక్షణాలుగా గుర్తించారు.

అయితే సెకెండ్ వేవ్ లో వీటితో పాటు మరికొన్ని లక్షణాలు బయటపడ్డాయి. కళ్లు గులాబీ రంగులోకి మారడం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లక్షణాలు, వినికిడి సమస్యల్ని కూడా కరోనా లక్షణాలుగా గుర్తించాలని సూచిస్తున్నారు.

పింక్ ఐస్: చైనాలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం కళ్ల రంగు గులాబీ వర్ణంలోకి మారడం కూడా కరోనా లక్షణమే. ఈ సెకెండ్ వేవ్ లో కండ్ల కలక ను కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని చెబుతున్నారు. 

కళ్లు వాపు, అదే పనిగా నీళ్లు కారడం కూడా కరోనా లక్షణాలుగా గుర్తించాలని సిఫార్స్ చేసింది. చైనాలో సెకెండ్ వేవ్ లో ప్రతి 12 మందిలో ఒకరు ఈ సమస్యతో వచ్చి పాజిటివ్ గా నిర్థారణ అవుతున్నారు.

వినికిడి సమస్య: ఉన్నఫలంగా వినికిడి శక్తి తగ్గినట్టు అనిపించినా, రింగింగ్ సౌండ్ అదే పనిగా వినిపిస్తున్నా అది కరోనా లక్షణం కావొచ్చు. 

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఓ స్టడీ ప్రకారం.. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి వినికిడి సమస్యలు కూడా తలెత్తవచ్చు. 56 అధ్యయనాల్ని అనుసరించి ఈ విషయాన్ని ధృవీకరించారు. వీటిలో 24 అధ్యయనాల్లో తేలింది ఏంటంటే.. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు వినికిడి సమస్య ఎదుర్కొనే అవకాశం 7.6 శాతం.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లక్షణాలు: తాజాగా నిర్వహించిన సర్వేల ప్రకారం.. జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కూడా కరోనా లక్షణాల కిందే లెక్క. ఉదాహరణకు విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, వికారం లాంటి సమస్యలు కూడా కరోనా లక్షణాలే. ఇకపై ఏదైనా జీర్ణాశయ సమస్య వరుసగా రిపీటైతే కరోనా టెస్ట్ చేయించుకోవడం మంచిది.