అప్పనకూ తప్పని ఏకాంత సేవ

కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ధాటీగా చూపిస్తోంది. ఈ దెబ్బకు మానవమాత్రులే కాదు, దేవుళ్ళు కూడా పూర్తిగా జడుసుకునే పరిస్థితి ఏర్పడింది. Advertisement ఏటా వైభవంగా జరిగే శ్రీ సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సానికి కరోనా…

కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ధాటీగా చూపిస్తోంది. ఈ దెబ్బకు మానవమాత్రులే కాదు, దేవుళ్ళు కూడా పూర్తిగా జడుసుకునే పరిస్థితి ఏర్పడింది.

ఏటా వైభవంగా జరిగే శ్రీ సింహాద్రి అప్పన్న కళ్యాణోత్సానికి కరోనా మహమ్మారి అడ్డుపడిపోయింది. దాంతో భక్త జన సందోహంతో కడు ఘనంగా జరగాల్సిన అప్పన్న కళ్యాణ వేడుకలు ఈసారి ఏకాంతంగా జరిగాయి.

పెళ్ళి కొడుకు అవుతున్న అప్పన్నస్వామిని చూడాలనుకునే భక్తులకు నో ఎంట్రీ అంటూ ఆలయ అధికారులు చెప్పడంతో లాంచనంగా స్వామి వారి కళ్యాణం వేద పండితుల సమక్షంలో జరిగిపోయింది. గత ఏడాది కూడా ఇదే వేళకు కరోనా మొదటి దశ అడ్డుపడింది. 

ఈసారి కూడా అదే సీన్ రిపీట్ కావడంతో అప్పన్న స్వామి అయినా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని భక్తులు ఆర్తిగా కోరుతున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రా జిల్లాలలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా ఉన్న అప్పన్న ఆలయం భక్తులు రాక వెలవెలబోతోంది. భగవంతుడికి, భక్తుడికీ మధ్యన అడ్డంగా చేరిన కరోనాను అంతం చేయాలని అంతా కోటి మొక్కులు మొక్కుతున్నారు.