బుల్లి తెర గ్లామర్ క్వీన్, హాట్ యాంకర్ అనసూయపై నెటిజన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. నెటిజన్‌కు ఆమె కూడా దీటైన సమాధానం ఇచ్చారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో అనసూయ ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఆమె షేర్ చేసుకుంటుంటారు. కొన్నిసార్లు ఆమె వేషధారణ తీవ్ర విమర్శలకు దారి తీస్తుంటుంది. అలాంటి వాటిని ఆమె అసలు లెక్క చేయకపోగా, ఎదురు దాడి చేస్తుంటారు.
తాజాగా తను ఒక్కసారిగా బాల్యాన్ని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె చిన్నపిల్లల అవతారం ఎత్తారు. రెండు జడలు వేసుకోవడంతో పాటు పొట్టి దుస్తుల్లో ప్రత్యక్షమై… కొన్నేళ్లు వెనక్కు వెళ్లిపోయారామె.
తాను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడూ అలానే ఉన్నానంటూ …అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇక్కడే వార్ స్టార్ట్ అయ్యింది. అనసూయను ఎక్కువ మంది వ్యతిరేకించడం గమనార్హం.
స్కూల్ బ్యాగ్ వేసుకోవడం మర్చిపోయినట్లుందనే సెటైర్లు విసిరారు. మరో నెటిజన్ అయితే తన ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేక చెలరేగిపోయారు.
అనసూయ డ్రెస్సింగ్‌పై ఆయన రియాక్షన్ ఏంటంటే… “కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. దీని గురించి నీకు కాస్తైనా బాధేయడం లేదా? ఇలాంటి సమయంలో ఈ ఫొటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది? అసలు ఇప్పుడీ ఫొటోలు పోస్ట్ చేయడం అంత అవసరమా?” అని ప్రశ్నించాడు.
నెటిజన్ కామెంట్‌పై అనసూయ దీలుగా, ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జనాలకు కొంత వినోదం, మరికొంత నమ్మకాన్ని కలిగించడానికి తాము ఈ విధంగా ప్రయత్నిస్తున్నామని అనసూయ బదులివ్వడం గమనార్హం. మొత్తానికి అనసూయ పోస్టు పెట్టారంటే …ఏదో ఒక రచ్చ జరగాల్సిందే. ఇదో అలవాటుగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.