చిరకాలంగా మేకింగ్ లోనే వున్న సినిమా ఆచార్య. మెగాస్టార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకుడు కొరటాల శివ తీ….స్తూ…వస్తున్న సినిమా ఆచార్య.
కరోనా రెండో దశ పుణ్యమా అని ఆచార్య సినిమా భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోయింది. ఈ సినిమాకు నిర్మాత నిరంజన్ రెడ్డి. సమర్పణ కొణిదెల అన్నది జస్ట్ ఓ టైటిల్ కార్డ్ మాత్రమే అని, మెగాస్టార్ కు, రామ్ చరణ్ కు రెమ్యూనిరేషన్ లే అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
ఇప్పుడు సినిమా రిస్క్ అంతా దర్శకుడు కొరటాల శివ మీద పడినట్లు బోగట్టా. ఎందుకంటే కొరటాల శివ తన సినిమాలు అన్నింటికీ మార్కెటింగ్ విషయాలు ఆయనే చూసుకుంటారు. ఆయన స్వంత డిస్ట్రిబ్యూటర్ల టీమ్ వుంది. వారికే సినిమాను అమ్మిస్తారు. ఆయనే రేటు ఫిక్స్ చేసారు.
గతంలో భరత్ అనే నేను సినిమా విడుదల అయిన తరువాత లాభ నష్టాల విషయంలో నిర్మాత దానయ్య కు దర్శకుడు కొరటాల కు మధ్య పొరపచ్ఛాలు వచ్చాయిన వార్తలు వున్నాయి. ఇప్పుడు ఆచార్య సినిమా మార్కెటింగ్ అంతా కొరటాలనే చూసారు.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అయిదు కోట్ల కు కాస్త అటు ఇటుగా లాభం తనకు ఇచ్చేలా, సినిమాను కొరటాల శివకు వదిలేసేలా, నిర్మాత నిరంజన్ రెడ్డి ఒప్పందం ఏదో కుదుర్చుకున్నారన్నది ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అలా సినిమా కొరటాలకు హ్యాండోవర్ చేసేసాక కరోనా ఫేస్ 2 స్టార్ట్ అయింది.
ఇప్పుడు సినిమా ఫైనాన్స్ వడ్డీలు, అన్నీ కొరటాల మీదే పడతాయని ఇండస్ట్రీ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అందువల్లే సినిమా విషయంలో ఇటు మెగాస్టార్ అటు నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రశాంతంగా వున్నారని టాక్ వినిపిస్తోంది.