అరవింద సమేత వీరరాఘవ తోలివారం పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సంగతి పక్కన పెడితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యాభై కోట్లను క్రాస్ చేయడం ద్వారా డీసెంట్ కలెక్షన్లు నమోదు చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడురోజులకు గాను 52 కోట్ల 66 లక్షలు వసూలు చేసింది అరవింద సమేత. సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 70 కోట్లకు పైగా థియేటర్ హక్కులు మార్కెట్ చేసారు. అంటే ఇంకా పాతిక నుంచి ముఫ్ఫైశాంతం దూరంలో వుందన్నమాట.
ఈవారం విడుదలయిన హలోగురూ ప్రేమకోసమే, పందెంకోడి కొంతవరకు అరవింద కలెక్షన్లను ప్రభావితం చేస్తాయి. పందెంకోడి సి సెంటర్లలో ఎక్కువగా వుంటుంది కాబట్టి అరవిందకు సమస్య వుండదు కానీ, హలోగురూ వల్ల బి సెంటర్లలో కాస్త ఇబ్బంది వుండొచ్చు.
అయితే సెకండ్ వీక్ నుంచి ఫోర్త్ వీక్ వరకు అరవిందకు పెద్దగా పోటీ అయితే లేదు. మరోపక్క థియేటర్లను బాగా తగ్గించి మెయిన్ స్క్రీన్ ల్లో మాత్రం వుంచారు. అందువల్ల షేర్ కోద్దిగా అయినా స్టడీగా వుండే అవకాశం వుంది. సో, లాంగ్ రన్ లో మరో పదిశాతం వరకు రికవరీ అవుతుంది. కొన్ని సెంటర్ లు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం వున్నా, కోన్ని సెంటర్లు 10 శాతం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది.
ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఇలా వున్నాయి
నైజాం…….15,80
సీడెడ్……….10.10
ఉత్తారాంధ్ర……..5.95
ఈస్ట్……..4.65
వెస్ట్……3.65
కృష్ణ…3.60
గుంటూరు…..6.75
నెల్లూరు.…2.16