ఒక్క ఫ్లాప్ కే ఒరిజనల్ పేరు బయటకు

సాగినంత కాలం తమంత వారు లేరందురు.. సాగకపోతే ఊరక చతికిలపడి పోవుదురు.. అన్నాడు వెనకటికి ఓ సినిమా కవి. నోటా అనే సినిమా కొట్టిన షాక్ కు విజయ్ దేవరకొండ ఒక్కసారికి తన ఒరిజినల్…

సాగినంత కాలం తమంత వారు లేరందురు.. సాగకపోతే ఊరక చతికిలపడి పోవుదురు.. అన్నాడు వెనకటికి ఓ సినిమా కవి. నోటా అనే సినిమా కొట్టిన షాక్ కు విజయ్ దేవరకొండ ఒక్కసారికి తన ఒరిజినల్ పేరు బయటకు తీసారు. విజయ్ పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. అయితే విజయ్ దేవరకొండను స్క్రీన్ నేమ్ గా చేసుకున్నాడు.

మరి నోటా ఫ్లాప్ తరువాత ఏమయిందో ఇప్పుడు పేరును దేవరకొండ విజయ్ సాయి బయటకు తెచ్చారు. ఈరోజు జరిగిన కేఎస్ రామారావు-క్రాంతి మాధవ్ కాంబినేషన్ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమా ఇన్విటేషన్ లలో దేవరకొండ విజయ్ సాయి అని పేరు వేయడం విశేషం.

నోటా సినిమా మీద విజయ్ చాలా హోప్ పెట్టుకున్నాడు. గీత గోవిందం సినిమా విజయంలో తన వాటా ఎంత అన్నది సరిగ్గా అంచనా వేసుకోలేకపోయాడు. అందుకే నోటా సినిమా విజయం సాధించేస్తుందని నమ్మేసాడు. ఆ సినిమాలో వాటా కూడా తీసుకుని, స్వంత బ్యానర్ కూడా ఫ్లోట్ చేసాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పల్టీ కొట్టింది. 

బహుశా సెంటిమెంటల్ గా తన అసలు పేరును వాడితే బాగుంటుందన్న సలహా వచ్చి వుండొచ్చు. దాంతో ఆ పేరు బయటకు వచ్చింది.

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి