మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా సినిమా షురూ అవుతోంది. చిరకాలంగా గల్లా అశోక్ సినిమా ఎంట్రీ వార్తల్లో వుంటూ వస్తోంది. ఆఖరికి ఇప్పుడు అది మెటీరియలైజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబే స్వయంగా ఈ ప్రాజెక్టును నిర్మాత దిల్ రాజు చేతిలో పెట్టారు.
గల్లా అశోక్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్యూర్ లవ్ స్టోరీ జోనర్ లో తయారయ్యే ఈ సినిమాకు 'అదే నువ్వు.. అదే నేను' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. శశి అనే కొత్త దర్శకుడు సినిమాను రూపొందిస్తారు.
రేపు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరో కృష్ణ హాజరవుతారు. తాతగా తన మనవడి సినిమా అరంగ్రేటం కార్యక్రమానికి ఆయనే ముఖ్య అతిథి.