1980ల నాటి సెటప్ తో రంగస్థలం సినిమా వచ్చింది. అప్పటి పరిస్థితులు, మాటలు, కట్టుబాట్లు ఆ సినిమాలో బాగా చూపించారు. రంగస్థలం విలేజ్ సెట్ అయితే అదిరిపోయింది. ఇదంతా ఇప్పుడెందుకంటే, ఆ సినిమా సక్సెస్ నుంచి, ఆ సినిమా ప్రభావం నుంచి సుకుమార్ ఇంకా బయటకు వచ్చినట్టు కనిపించడం లేదు.
మహేష్ తో చేయాల్సిన తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం కూడా దాదాపు ఇలాంటి సెటప్ కోసమే సుకుమార్ ప్రయత్నిస్తున్నాడు. రంగస్థలం కోసం 1980ల నాటి గ్రామాన్ని సెలక్ట్ చేసుకున్న సుక్కూ, మహేష్ కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితుల్ని నేపథ్యంగా తీసుకుంటున్నాడు. అంటే 1950ల నాటి కథ అన్నమాట. ఈ స్టోరీలైన్ కు మహేష్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
అయితే రంగస్థలం టైపులో ఇది పూర్తిగా పాత తరానికి చెందిన కథ కాదట. ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే 1950ల నాటి కాన్సెప్ట్ కనిపిస్తుందట. ఇదంతా చూస్తుంటే, రంగస్థలం హ్యాంగోవర్ నుంచి సుకుమార్ ఇంకా బయటకొచ్చినట్టు కనిపించడం లేదు.
అన్నట్టు ఈ సినిమా కోసం తన టీమ్ ను పూర్తిగా మార్చేశాడు సుకుమార్. రంగస్థలం సినిమాకు సుకుమార్ వద్ద కీలకంగా ముగ్గురు రైటర్లు పనిచేశారు. వాళ్లలో ఇద్దరు మహేష్ సినిమాకు వర్క్ చేయడం లేదు. ఒక వ్యక్తి దర్శకుడిగా మారాడు. మరొకర్ని తనే స్వయంగా దర్శకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ సినిమా నిర్మించబోతున్నాడు.