ప్రభాస్-సాహో.. మేకింగ్ వీడియో

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ న్యూస్. ప్రభాస్ కొత్త స్టిల్స్ కోసం, సాహో అప్ డేట్స్ కోసం మొహం వాచి, ట్విట్టర్ లో రిక్వెస్ట్ లు చేసి, చేసి విసిగిపోయిన ఫ్యాన్స్ కు ఊరట.…

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ న్యూస్. ప్రభాస్ కొత్త స్టిల్స్ కోసం, సాహో అప్ డేట్స్ కోసం మొహం వాచి, ట్విట్టర్ లో రిక్వెస్ట్ లు చేసి, చేసి విసిగిపోయిన ఫ్యాన్స్ కు ఊరట. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓ గిఫ్ట్ ను ఫ్యాన్స్ కోసం రెడీ చేస్తున్నారు.

ఆ మధ్య దుబాయ్ లో కోట్లకు కోట్లు ఖర్చు చేసి భారీ ఛేజ్ అండ్ యాక్షన్ సీన్ తీసారు. ఆ సీన్ తాలూకా మేకింగ్ వీడియోను ఫ్రభాస్ బర్త్ డే గిఫ్ట్ గా విడుదల చేయబోతున్నారు. మేకింగ్ వీడియో కటింగ్ పూర్తయిపోయింది. మ్యూజిక్ యాడ్ చేసే కార్యక్రమం చెన్నయ్ లో జరుగుతోంది. నిర్మాత వంశీ దగ్గర వుండి ఈ మేకింగ్ వీడియో పనులు చూస్తున్నారు.

ఇది కనుక బయటకు వస్తే సాహోకు సూపర్ బజ్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. బజ్ మాటకు ఏమో కానీ, ఫ్యాన్స్ చేత అడిగించుకుని, తిట్లు తిట్టించుకునే బాధ పీఆర్వోలకు తప్పుతుంది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి