బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ అయిపోయింది. ఇక అనౌన్స్ మెంట్ నే తరువాయి. ఇప్పుడు బాల్ త్రివిక్రమ్ కోర్టులోనే వుంది. అనౌన్స్ మెంట్ ఆయన ఎప్పుడు అంటే ఆయనే చేద్దామని బన్నీ చెప్పేసాడు. అయితే ఒక్కటే సమస్య బ్యానర్ ఏమిటన్నది?
త్రివిక్రమ్ హారిక హాసిని అంటారు. బన్నీకి స్వంత బ్యానర్ ఫ్లోట్ చేసి, దాని మీద తొలిసినిమాగా ఈ కాంబినేషన్ చేయాలని వునట్లు తెలుస్తోంది. దీనిపై ఫైనల్ రౌండ్ డిస్కషన్లు బకాయి వున్నాయి. అవి పూర్తయిపోతే అనౌన్స్ మెంట్ వస్తుంది.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం 25 తరువాత బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రకటన వుంటుందని తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చాయి. అవి ఓ మాదిరి హిట్ లుగా నిలిచాయి. బ్లాక్ బస్టర్ బకాయి వుంది. అది ఇప్పుడు ఈ సినిమాతో పూర్తవుతుందని బన్నీ గట్టి నమ్మకంతో వున్నారు.