అమరావతి మహిళల్ని అంతగా దిగజార్చాలా..?

“రాజధానిలో మహిళలను మానప్రాణాలతో తిరగనీయరా. మహిళలు స్నానం చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తారా, మమ్మల్ని మర్యాదగా బతకనివ్వరా, మానసికంగా బ్లాక్ మెయిల్ చేస్తారా..” రెండు రోజులుగా ప్రభుత్వంపై రాజధాని మహిళల పేరుతో ఓ పెయిడ్…

“రాజధానిలో మహిళలను మానప్రాణాలతో తిరగనీయరా. మహిళలు స్నానం చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తారా, మమ్మల్ని మర్యాదగా బతకనివ్వరా, మానసికంగా బ్లాక్ మెయిల్ చేస్తారా..” రెండు రోజులుగా ప్రభుత్వంపై రాజధాని మహిళల పేరుతో ఓ పెయిడ్ బ్యాచ్ చేస్తున్న తీవ్ర విమర్శలివి. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరూ దీన్ని సహించరు, పోలీసులైనా సరే డ్రోన్ కెమెరాను ఇళ్లపైన తిప్పడం, సగటు ప్రజలను మరీ అంత తీవ్రవాదుల్లాగా అనుమానించడం తగదు.

అయితే అసలు ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తేలితే.. నిందలు వేసినవాళ్లు ఎంత నీఛులో అర్థం చేసుకోవాలి. సరిగ్గా అదే జరిగింది. అసలు రాజధాని ప్రాంతంలో ప్రజల ఇళ్లపై డ్రోన్ కెమెరాలే ఎగరేయలేదని, పోలీసులపై మరీ అంత దిగజారి విమర్శలు చేయడం సరికాదన్నారు హోం మంత్రి మేకతోటి సుచరిత. దిశ లాంటి చట్టాలతో మహిళలకు భరోసా కల్పిస్తున్న జగన్ సర్కారుపై ఇలాంటి ఆరోపణలు వారి నీఛ సంస్కృతిని బట్టబయలు చేశాయని అన్నారు. పోలీసుల పనితీరుపై దుష్ప్రచారం చేయడం సరికాదని తన శాఖ ఉద్యోగులకు బాసటగా నిలిచారు. 

ఇప్పటికే రాజధాని రైతుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న టీడీపీ, అమరావతి బలిదానాలు అంటూ.. సహజ మరణాల్ని కూడా ఆ ఖాతాలో వేస్తూ రోజు రోజుకీ లెక్క పెంచుకుంటూ పోతోంది. అనుకూల మీడియాతో ప్రభుత్వ వ్యతిరేక కథనాలను జోరుగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మరింత దిగజారి ఆడవారి మర్యాదని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. అందుకే కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ ల చేత తాము స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో షూట్ చేశారని తీవ్ర ఆరోపణలు చేయించారు.

అసలు ఆడవాళ్లు స్నానం చేస్తుంటే పోలీసులు డ్రోన్ కెమెరాలతో ఎందుకు చిత్రీకరిస్తారు? అసలిప్పుడు ఆరుబయట బాత్రూంలున్నాయా? రాజధాని ప్రాంతం ఇప్పటి వరకూ చాలాసార్లు వార్తల్లోకెక్కింది. అక్కడి బిల్డింగ్ లు, డూప్లెక్స్ హౌస్ లు.. ఆ వ్యవహారమే వేరు. అలాంటి వారు ఇంటి బయట డ్రోన్ కెమెరాలకు కనపడేటట్టు ఉండే ఓపెన్ బాత్రూమ్స్ లో స్నానాలు చేస్తారా? ఇవన్నీ ఆలోచించకుండానే వారు నీఛమైన ఆరోపణలు తెరతీశారు. చివరకు హోంమంత్రి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. తమ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ఎంతకైనా దిగజారడానికి రెడీగా ఉంటుందని ఈ చీప్ ట్రిక్స్ తో మరోసారి రుజువైంది.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు