Advertisement

Advertisement


Home > Politics - Gossip

పల్లె ఎన్నికల్లో చీపురు : కామెడీ కదా!

పల్లె ఎన్నికల్లో చీపురు : కామెడీ కదా!

ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసి.. అద్భుతం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా అడుగుపెట్టబోతున్నదా? నిజానికి గత ఎన్నికల్లో కూడా వారి అస్తిత్వం అక్కడక్కడా అంతో  ఇంతో ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ ఆప్ కూడా పోటీచేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజలకు పెద్ద కామెడీ వార్తలాగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అరవింద్ కేజ్రీవాల్ కు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజి, నిజాయితీ ఆధారంగా నిర్మితమైన పార్టీ. అందుకే  తొలిసారి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా వారికి ఢిల్లీ ఎన్నికల్లో ఫలితం కనిపించింది.  ఒకసారి తన చేతికి అధికారం దక్కిన తర్వాత.. కేజ్రీవాల్.. తన పాలన సామర్థ్యాలను నిరూపించుకున్నారు. వరుసగా మూడోసారి  కూడా సీఎం అయి హ్యాట్రిక్ కొట్టారు.

కొట్టారు అయితే సీఎం కేజ్రీవాల్ సంక్షేమ పథకాలు అన్నీ నగరజీవులను ఉద్దేశించినవి. ఆయన పార్టీ భావజాలమే.. నగరజీవులకు, ఉద్యోగుల్లో ఆలోచనపరులు, విద్యావంతులను మాత్రమే ఆకట్టుకునే విషయాలు. ఇది చాలా మౌలికమైన తేడా. అలాంటి తేడా గురించి అందరికీ తెలిసినదే అయినప్పటికీ.. కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేయగలం అనేంత నమ్మకంతో గట్టిగానే ప్రయత్నించారు గానీ చతికిలపడ్డారు.

నిజాయితీ, విలువలు గల పార్టీలకు ఆదరణ ఉండదని అనలేం గానీ. అలాంటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనే ఎక్కువగా రాణించగలుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముఖచిత్రం అనేది ఎంతో విభిన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఆప్ ఎలా రాణిస్తుంది. ఇది సందేహమే.

అయితే ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టడం ద్వారా ఆప్ కు ఉన్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవడానికి మన రాష్ట్రంలో కూడా అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలై.. ఉన్న పార్టీలను వదిలిపెట్టిన కొందరు నాయకులు కూడా... నిజాయితీ అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని ఆప్ ముద్ర కోసం తహతహలాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆప్ ను బరిలోకి దించడం అనేది.. రాజకీయంగా ఎవరికైనా ఉపయోగపడడానికి అనుసరించే వ్యూహం గానీ, తమ ఇమేజి పెంచుకోడానికి కొందరు చేసే అనుచిత కుట్ర గానీ అయిఉండవచ్చుననే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి.

మోడీ దోచుకొని తినమని చెప్పాడా నీకు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?