Advertisement

Advertisement


Home > Politics - Gossip

సవాళ్లు విసిరిన వాళ్లంతా.. స్పందించాలి!

సవాళ్లు విసిరిన వాళ్లంతా..  స్పందించాలి!

అమరావతి ప్రాంతంలో.. రాజధాని ఏర్పాటు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ పన్నిన ఒక పెద్ద కుట్ర అనే మాట చాలాకాలంగా ప్రచారంలోనే ఉంది. ఆ విషయాన్ని ముందే తమ పార్టీ వారికి లీక్ చేసి.. ఆ ప్రాంతంలో వందల వేల ఎకరాల్లో భూముల్ని కారుచౌకగా కొనేసిన తర్వాత.. రాజధాని ప్రకటన చేశారని.. ఆ రకంగా పేదలు, స్థానికులు తీవ్రంగా నష్టపోగా, తెదేపా అనుకూల దళారీలు లాభపడ్డారనే ఫిర్యాదులు చాలాకాలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత..  అమరావతి ఇన్ సైడింగ్ ట్రేడింగ్ గురించి కూడా చాలా ఆరోపణలు చేశారు.

అయితే జగన్ సర్కారు ఈ విషయం ప్రస్తావించిన ప్రతిసారీ.. తెదేపా నేతలు మాత్రం తామెవ్వరికీ అమరావతిలో సెంటు భూమిలేదని చిలుక పలుకులు పలుకుతూ వచ్చారు. తెదేపా నేతల్లో ఎవరెవరి ఆస్తులు ఏయే బినామీ పేర్లతో ఉన్నాయో కొన్ని వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తర్వాత మిన్నకుండిపోయింది. అప్పుడలా సైలెంట్ కావడం వెనుక మర్మం ఇప్పుడు బోధపడుతోంది.

ప్రస్తుతం జగన్ సర్కారు ఏర్పాటుచేసిన సిట్ అనేది అమరావతి భూ కుంభకోణాల గురించి కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ సిట్ కు కేసు నమోదు చేయడానికి, చార్జిషీటు దాఖలు చేయడానికి కూడా సంపూర్ణాధికారాలు ఉంటాయి. అందుకు తగినట్లుగా ఈ సిట్ ను ఒక ప్రత్యేక పోలీసు స్టేషన్ గా ప్రభుత్వం నోటిఫై చేసింది. వీరు బినామీ లావాదేవీలు ఎలా జరిగాయి.. రైతులనుంచి భూదోపిడీ జరిగిన క్రమం ఏమిటో మొత్తం నిగ్గు తేలుస్తారు.

అమరావతిలో నాకు గానీ, నా వారికి గానీ సెంటు భూమి లేనే లేదు .. .అంటూ గత కొన్ని నెలలుగా పలికిన తెదేపా నాయకులంతా ఇప్పుడు స్పందించాలి. సిట్ విచారణలో అలాంటి వారందరికీ కూడా నోటీసులు తప్పకుండా వస్తాయి. వారి పేర్ల మీద ఉండకపోవచ్చు. కానీ బినామీ పేర్ల మీద నడిపించే వ్యవహారాలకు కూడా బాధ్యత వహించాల్సిందే. అందుకే.. గతంలో సవాళ్లు విసిరిన వారందరూ కూడా.. ధైర్యముంటే సిట్ ఏర్పాటు తర్వాత స్పందించాలని.. సిట్ ఎదుట స్వచ్ఛంద విచారణకు హాజరు కావాలని, తాము పరిశుద్ధులమని నిరూపించుకోవాలని కూడా పలువురు  వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

మోడీ దోచుకొని తినమని చెప్పాడా నీకు 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?