Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబు డిమాండ్ సబబుగానే ఉంది!

బాబు డిమాండ్ సబబుగానే ఉంది!

గత ప్రభుత్వపు పాలనలోని అవినీతి, అక్రమాలపై విచారించి కేసులు నమోదు చేయడానికి కొత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాల్ని, ప్రత్యేకించి తెలుగుదేశం రాజకీయాల్లో ప్రకంపనల్ని సృష్టిస్తోంది. తెదేపా నేతలందరూ దీనిని ఖండించడంలోనే నిమగ్నం అయి ఉన్నారు. అయితే ఎంతచెడ్డా నలభయ్యేళ్ల సీనియారిటీ ఉన్న చంద్రబాబునాయుడు స్పందనలే.. అంతో ఇంతో సబబుగా కనిపిస్తున్నాయి.

చంద్రబునాయుడు ప్రధానంగా సిట్ కు బదులుగా న్యాయ విచారణ కోరుతున్నారు. సిట్, స్టాండింగ్ కమిటీలు వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితాలుగా పనిచేస్తాయనే అభిప్రాయం ప్రజలకు కలిగించడం ఆయన లక్ష్యం. అమరావతిలో, విశాఖలో భూకుంభకోణాలు వెలుగులోకి రావాలంటే.. హైకోర్టు ప్రధానన్యాయమూర్తితోనే విచారణ జరిపించాలన్నది ఆయన మాట. అది మంచిదే. సిటింగ్ జడ్జితోనే విచారణ జరిగితే గనుక.. శిక్షలు విధించడానికి కూడా మార్గం కొంత సుగమం కావొచ్చు.

తన వైఫల్యం తానే చాటుకుంటున్న బాబు

అయితే సిట్ కు వ్యతిరేకంగా తన గళం వినిపించడంలో, న్యాయవిచారణ కోసం పట్టుపట్టడంలో.. పరోక్షంగా తన వైఫల్యాన్ని చేతకానితనాన్ని కూడా చంద్రబాబు ఒప్పుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన హయాంలో విశాఖలో అతి పెద్ద భూకుంభకోణం వెలికి వచ్చింది. చంద్రబాబు దానిపై ఏం స్పందించారు. ఆ కుంభకోణం గురించి. ఆయన గనుక న్యాయవిచారణ జరిపించి ఉంటే.. ఇవాళ ఆయన అలాంటి డిమాండు చేస్తున్నప్పుడు ప్రజలు విశ్వసించేవాళ్లు.

అలా కాకుండా చంద్రబాబు విశాఖ భూకుంభకోణంపై సిట్ వేశారు. విశాఖ భూములపై తాను వేసిన సిట్ ను పక్కన పెట్టి, మరో సిట్ వేసి వాస్తవాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అదే ఆయన వైఫల్యం. ఆయన జమానాలో ఓ సిట్ వేశారు. అది అసలు ఏం పనిచేసింది.? ఏం నివేదిక ఇచ్చింది? అప్పటి ముఖ్యమంత్రిగా ఆయన ఏం సమాధానం చెప్తారు? నామమాత్రంగా సిట్ వేసి, వారిచ్చిన నివేదిక కూడా బయటకు రాకుండా తొక్కేసి.. చంద్రబాబు సిట్ అనేదానిని ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వాడుకోవచ్చునని అప్పుడే నిరూపించారు.

అంత అనుభవం ఉన్నది గనుకనే.. ఇప్పుడు సిట్ అనగానే.. భయంతో న్యాయవిచారణ కోరుతున్నారు. మరి అప్పుడు ఆయనే న్యాయవిచారణ జరిపించి.. మార్గదర్శకంగా నిలిచి ఉండొచ్చు కదా.. అని కూడా ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన డిమాండ్ సబబుగానే ఉంది గానీ.. భయంతో అంటున్నట్లుగా ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

మోడీ దోచుకొని తినమని చెప్పాడా నీకు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?