ఒకప్పుడు అవినీతి గొంతు నులమాలంటూ కొండెక్కి అరిచారు. ఎక్కడ ఏ మూల అవినీతి ఉన్నా శోధించి బయటకు తీస్తామని ఘీంకరించారు. ఇది ఎవరి గురించి అంటున్న మాటలో అర్థం అయి ఉండాలి. తెలుగు ప్రజల గుండెచప్పుడు, ఆత్మగా ప్రచారం చేసుకునే ఈనాడు గురించే.
మరి ఇప్పుడు ఆ పత్రికకు ఏమైంది? తమకు నచ్చనివారిపై రంధ్రాన్వేషణ చేసే మీడియా, ఇప్పుడు వేలకోట్ల రూపాయల స్కామ్ అని ఏకంగా ఆదాయపన్ను శాఖే ప్రకటిస్తే అటువైపు కూడా ఎందుకు చూడడం లేదు? గజం మిద్య, పలాయనం మిద్య అని ఒక వ్యాక్యం ఉంది. అందుకు తగినట్లుగానే తెలుగుదేశం పార్టీ వ్యవ హరిస్తున్నట్లుగా ఉంది. దానికి తాన అంటే తందానా అన్నట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు భజన చేయడం మరింత విడ్డూరంగాఉంది.
ప్రతిపక్షనేత చంద్ర బాబునాయుడు మాజీ పీఎస్ ఇంటిలో దొరికింది 2.63 లక్షలేనని, వైసీపీ నేతలు రెండువేల కోట్లు అని దుష్ర్ప చారం చేస్తున్నారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ద్వజమె త్తారు. శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు ఉన్న టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కసారిగా జూలు విదుల్చుకుని మాట్లాడినట్లుగా వ్యవహరించారు. నిజంగానే వీరి మాట లు విన్నవారికి టీడీపీ కడిగిన ముత్యం వల్లే బయటకు వచ్చేశారేమోనని అనిపిస్తుంది. అంతేకాదు.. ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలలో వార్తలను చూస్తే లెక్క తేలిపోయిందేమోనన్న అనుమానం వస్తుంది. యనమల రామకష్ణుడు అయితే ఒక అడుగు ముందుకు వేసి వైసీపీ నేతలపైన, సాక్షి మీడియాపైన పరువు నష్టం దావా వేస్తా మని చెప్పారు.ఎంత చక్కని మాట.
నిజంగానే యనమల దైర్యం ఉంటే పరువు నష్టం దావా వేయాల్సింది ఆదాయ పన్ను శాఖ మీద. నిజంగానే యనమలకు తన వాదనపై తనకు చిత్తశుద్ధి ఉంటే పరువు నష్టం దావా వేయాల్సింది కేంద్రప్రభుత్వంపైన. అంతేకాదు.. దమ్ముంటే ఇదంతా బీజేపీ కుట్ర అని అని ఉండాల్సింది. ఏ చిన్న ఇష్యూ అయినా టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతుంటారు కదా.. ఆయనను యనమల అడిగి ఉండాల్సింది. మన చేతులు క్లీన్ అయిపోయినట్లేనా? అది నిజంగా జరిగి ఉంటే యనమ లకు చంద్రబాబు ఎందుకు అవకాశం ఇచ్చేవారు. ఆయనే కొండెక్కి గగ్గోలు పెట్టేవారు కదా.. తనపై ఇంత దారు ణమా? ఇంత కుట్రా అని అడిగేవారు కదా..కాని ఆయన ఎందుకు చేయలేదు.
టీడీపీ నేతల ప్రకటనల సారాంశం అంతా ఈనాడులో చదివాను. అవి చదివితే వారు ఎక్కడ రెండువేల కోట్ల నిధులు పక్కదారి పట్టించిన ఆదాయ పన్ను శాఖ ప్రకటనను గురించి ప్రస్తావించినట్లు కనిపిం చలేదు. మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో 2.63 లక్షలు దొరికినట్లు పంచనామా గురించే కథలు, కథలుగా చెప్పారు. ఆదాయపన్ను శాఖ రంగంలో అనుభవం ఉన్నవారు చెబుతున్నది ఏమటంటే, ఆరో తేదీనాడు శ్రీనివాస్ ఇంటిలో దొరికిన నగదు, బంగారం గురించి మాత్రమే టీడీపీ వారు మాట్లాడుతున్నారని వారు తేల్చారు. మిగిలిన నాలుగు రోజుల తనిఖీలలో ఏమి దొరికాయో ఎందుకు వెల్లడించడం లేదు అని ప్రశ్నించారు.
మరి మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి చెందిన ఆర్.కే.ఇన్ప్రా, నరేష్‌కు చెందిన మరో కంపెనీ, కిలారీ రాజేష్ నివాసం మొదలైనచోట్ల జరిగిన దాడుల గురించి యనమల కాని, ఇతర నేతలు కాని ఎందుకు మాట్లాడలేదు. అంటే చంద్ర బాబుకు సంబందం లేకుండా వారంతా రెండువేల కోట్లు నొక్కేశారని యనమల ఒప్పుకుంటున్నారా? లేదా ఇన్ కమ్ టాక్స్ శాఖ తప్పుడు ప్రకటన చేసిందని వీరు అనదలిచారా?ధైర్యం ఉంటే ఆ మాట అనాలి కదా..సాక్షిపై దావావేయడానికి ముందు 2 వేల కోట్ల రూపాయల స్కామ్ అంటూప్రకటన చేసిన ఐటి శాఖపై దావా వేయాలి కదా.. తమ సోదాలలో ఒక ప్రముఖడి మాజీ పీఎస్‌తో సహా ఆయన అనుచరుల వద్ద ఈ అక్రమ లావాదేవీలు రెండు వేల కోట్ల మేర జరిగాయని రాసిని ఆదాయపన్ను శాఖను యనమల నిలదీయాలి కదా?
వీరు మనీలాండరింగ్ చేశారని, ఇతర అబియోగాలు మోపిన వారిని ప్రశ్నిం చాలి కదా..ఇవేవి చేయకుండా కేవలం వైసీపీ నేతల విమర్శలకు జవాబుగానే టీడీపీ నేతలు ఎందుకు పరిమితం అయ్యారు? ఎందుకంటే వారికి తెలుసు..వారు చేస్తున్నది మోసమని, కాని ఇప్పటికే అప్రతిష్టపాలైన టీడీపీని కొంతైనా కవర్ చేసి ప్రజలలో ఒక అబద్దాన్ని ప్రచారం చేయడం ద్వారా టీడీపీ కార్యకర్తలకు కొంత ధైర్యం ఇవ్వాలన్నదే వారి ఆలోచన అనుకోవాలి.
టీడీపీ వారికంటే ఒక రాజకీయ పార్టీగా ఏవో జిమ్మిక్కులు చేయక తప్పదని అనుకోవచ్చు. కాని అవినీతిపై అంకుశంపెట్టి పోరాడాలని నిత్యం సంపాదకీయాలలో ఏళ్ల తరబడి రాస్తున్న రామోజీరావుకు ఏమైంది.మిగిలిన టీడీపీ మీడియాకు పెద్దగా విలువలు పట్టించుకోవల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. కాని సుద్దులు చెప్పే రామోజీరావుకు చెందిన మీడియా ఏమి ప్రచారం చేసింది. లేక్క తేలింది .. అని హెడింగ్ పెట్టి టీడీపీ నేతల వాదనలను తెగ ప్రచారం చేయడం ద్వారా సమాజానికి రామోజీ ఏమి సందేశం ఇవ్వదలిచారు?
అంతేకాదు.. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలలో 2 వేల కోట్లు దొరికాయమని మేము ఎక్కడ అన్నాం అన్న హెడింగ్ పెట్టడంలోని ఆంతర్యం అర్దం కావడం లేదా? బొత్స అన్నారా? యనమల అన్నారా? అన్నది పక్కన పెడితే అసలు ఐటి శాఖ ఏమనన్నది రామో జీరావుకు కాని, ఆయన సంపాదకవర్గానికి తెలియదా? 2 వేల కోట్ల కుంభకోణం గురించి ఎత వివరంగా ఐటి శాఖ ప్రెస్‌నోట్‌లో తెలిపింది చదవలేకపోయారా?
నిజానికి వేరేవారికి సంబంధించి ఏదైనా చిన్న విషయం దొరికితే చిలవలు,పలవలు చేసి పేజీలకు పేజీలు స్టోరీలు రాసే పారేసే ఈనాడుకు ఈ స్కామ్‌లో పిఎస్ ఎవరో, ఆ పిఎస్ ఎవరి వద్ద పనిచేశారో? ఇంతవరకు తెలియలేదా? అసలు చంద్రబాబు పేరు రాయకుండా ఎందుకు జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు పట్టుబడ్డ కంపెనీలన్నీ టీడీపీవారివా? కాదా? ఇలాంటి విషయాల జోలికి ఈనాడు వెళ్లలేదంటే వారికి సమాజం పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి అర్ధం అయిపోతుంది.
అలాగే వారు ఇంతకాలం అవినీతికి వ్యతిరేక పోరాటం చేసిన ప్రచారం అంతా ఉత్తమాట అని తేలిపోవడం లేదా? ఇదేనా రామోజీరావు సాధించిన ప్రగతి. చంద్రబాబును ఎత్తుకుని మోయడంలో భాగంగా చివరికి వేల కోట్ల అవినీతి బయటపడిందని ఆదాయపన్ను శాఖ చెబితే కూడా స్పందించ లేకపోయారంటే ఈనాడు, రామోజీరావు ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారో తెలిసి పోవడం లేదా?
అయ్యా.. రామోజీగారు.. సంపాదకీయా లు రాయించడం కాదు.. అవకాశం వచ్చినప్పుడు అవి నీతిపై నిజంగా పోరాడాలి. కాని లెక్క తేలింది అంటూ ఇంత పెద్ద స్కామ్‌ను నీరుకార్చడంలో ఈనాడు రామోజీ కూడా తనవంతు పాత్ర పోషించడం విచారకరం!
కొమ్మినేని శ్రీనివాసరావు