బాలయ్య గోచీతో కనిపిస్తారా?

అఘోరా గా బాలయ్య కనిపించబోతున్నారని గ్రేట్ ఆంధ్ర ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బోయపాటి-బాలయ్య సినిమాలో ఇద్దరు బాలయ్యలకు ఓ బాలయ్య కాశీలో అఘోరాల మధ్య పెరుగుతాడని, సినిమా మధ్యలో ఇది రివీల్ అవుతుందని…

అఘోరా గా బాలయ్య కనిపించబోతున్నారని గ్రేట్ ఆంధ్ర ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బోయపాటి-బాలయ్య సినిమాలో ఇద్దరు బాలయ్యలకు ఓ బాలయ్య కాశీలో అఘోరాల మధ్య పెరుగుతాడని, సినిమా మధ్యలో ఇది రివీల్ అవుతుందని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే బాలయ్యను కూడా అఘోరా గెటప్ లోనే చూపించాలా? లేదా కాషాయం కట్టి సన్యాసి వేష ధారణలో చూపించాలా? అనే దానిపై బోయపాటి టీమ్ కిందా మీదా అవుతోందని తెలుస్తోంది.

బాలయ్య తో హీరోయిన్ గా చేయడానికి ఏ స్టార్ హీరోయిన్ ముందుకు రాకపోవడంతో అంజలి ని తీసుకున్నారు. సినిమాలో హీరోయిన్ పాత్రకు ఓకె చాలా మంది ఓకె అనకపోవడానికి హీరోయిన్ కు సినిమాలో పెళ్లి కావడం, పిల్ల తల్లిగా వుండడం వంటి పాయింట్ వుందని, అందుకే చాలా మంది ఓకె అనలేదని తెలుస్తోంది.  సినిమాలో అంజలి అనంతపురం కలెక్టర్ గా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా వుంటే ఇండస్ట్రీలో బోయపాటి-బాలయ్య సినిమా కథ మీద బోలెడు పాయింట్లు చలామణీలో వున్నాయి. మరీ కొత్త కథ కాదని, లెజెండ్ లాంటి కథే అని, ఇద్దరు పిల్లలు, జాతకాల కారణంగా వేరే చోట పెరగడం, మొదటి వాడికి కష్టం వస్తే, ఇంటర్వెల్ టైమ్ కు రెండో వాడు వచ్చి ఆదుకోవడం లాంటి పాయింట్ వుంటుదని తెలుస్తోంది. మరో నెల రోజుల తరువాత బోయపాటి – బాలయ్య సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది.