ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు చంద్రబాబుని ఆకాశానికెత్తేశారు. బాబు వంటి రాజకీయ నాయకుడు లేనే లేరు అంటూ కీర్తించారు. నాలుగు దశాబ్దలా అనుబ్దాల అనుభవంతో చంద్రబాబు రాష్ట్రానికి విశేష సేవలు అందించారని కూడా ప్రశంసించారు.
దేశానికి ఎందరో ప్రధానులను రాష్ట్రపతులను అందించిన ఘనత బాబుదేనని అచ్చెన్న చాలా చెప్పారు. బాబును మళ్ళీ ఏపీకి ముఖ్యామంత్రిని చేసేంతవరకూ విశ్రమించరాదని ఆయన క్యాడర్ కి పిలుపు ఇచ్చారు.
ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంతలా బాబుని అచ్చెన్న ఎందుకు పొగుడుతున్నారు అన్నదే చర్చట. తిరుపతి వీడియో బయటకు వచ్చిన దగ్గర నుంచి అచ్చెన్న అతిగానే అంతా మాట్లాడుతున్నారని తమ్ముళ్ళ చర్చగా ఉందిట.
మొత్తానికి అచ్చెన్న బాబుని ఇంద్రుడు చంద్రుడు అంటున్నారు. మరి పార్టీ లేదు బొక్కా లేదు అన్నది కూడా ఇదే అచ్చెన్న కదా వైసీపీ నేతలు గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా అచ్చెన్న ఇకపైన ఇలాగే ముందుకుపోతారేమో మరి.