నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లోని సవ్యసాచి సినిమా విడుదల ఇంక మరో మూడువారాల్లో వుంది. ఈ సినిమాకు ఆదిలో డిజిటల్ అండ్ శాటిలైట్ బిజినెస్ మంచి రేట్లకు క్లోజ్ అయింది. ఆ విధంగా సినిమా మీద అంచనాలు పెంచింది. అయితే షూటింగ్ చాలా ఆలస్యం కావడం, నాగచైతన్యను బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు పలకరించడంతో థియేటర్ బిజినెస్ మాత్రంకాలేదు. టీజర్, సాంగ్ ప్రోమోలు రావడంతో ఇప్పుడు మొత్తంమీద బిజినెస్ క్లోజ్ అయింది.
అయితే అలా మరీ పెద్ద అద్భుతమైన రేటు ఏమీరాలేదు. సినిమాకు ఖర్చు ఎక్కువే అయింది. ఆ లెక్కన దాదాపు పాతిక నుంచి ముఫై కోట్ల రేంజ్ లో థియేటర్ రైట్స్ అమ్మాలి. కానీ ఆ రేట్లకు కొనేవారు లేరు. దాంతో ఎలాగూ శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ బాగానే వచ్చాయి కనుక, రీజన్ బుల్ రేట్లకు క్లోజ్ చేసేసారు.
ఆంధ్రను సగటున 9 కోట్ల రేషియోలో క్లోజ్ చేసారు. సీడెడ్ ను మూడుకోట్లకు ఇచ్చేసారు. సీడెడ్ మొత్తం ఎన్వీప్రసాద్ పంపిణీ చేస్తారు. నైజాం మాత్రం అలాగే వుంది. అయితే నైజాం అంటే పంపిణీకి ఇచ్చేయడం కామన్. కానీ సవ్యసాచికి మాత్రం బాగానే ఎంక్వయిరీలు వస్తుండడంతో, రేట్ సెట్ అయితే ఇచ్చేద్దామనే ఆలోచనతో బేరాలు సాగుతున్నాయి. అయిదు కోట్లకు పైగానే ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే జరిగితే, టోటల్ గా ఆంధ్ర తెలంగాణ కలిపి 17 కోట్లకు థియేటర్ రైట్స్ ఇచ్చినట్లు అవుతుంది. వరుసగా రెండు మూడు హిట్ లు కొడితే తప్ప నాగచైతన్య మార్కెట్ పెరగదేమో?