సినిమా ఫంక్షన్లలో వచ్చిన గెస్ట్ లు, సెలబ్రిటీల గురించి అడియో విడియో ప్రెజెంటేషన్ వేయడం అన్నది కామన్. అయితే అది వీలయినంత క్లుప్తంగా, షార్ప్ గా, భలే కట్ చేసారు అనేట్లు గా వుంటాయి.
నిన్నటికి నిన్న జరిగిన చావు కబురు చల్లగా ఫంక్షన్ కోసం తయారు చేసిన బన్నీ వాస్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ల ఏ..వి లు భలే చిత్రంగా వున్నాయి. చాలా లెంగ్తీ ఎవీ లు కావడం విశేషం. అది కూడా ఏదో ఫ్యాన్స్ తమ తమ హీరోల గురించి తమకు నచ్చినది, తమకు గుర్తు వున్నవి ఎడా పెడా రాసేసుకున్నట్లుగా రాసేసారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అరవింద్, బన్నీ ల గురించి ఇప్పుడు అంత వివరమైన ఎవిలు అవసరమా? అన్న కామెంట్లు ఫంక్షన్ లోనే వినిపించాయి. ఉగ్గుపాలతో మొదలుపెట్టి, ఇవ్వాల్టి దాకా చెప్పుకొచ్చారు. బన్నీవాస్ ఎ వి అయితే పాలకొల్ల ఎమ్మెల్యే టికెట్ కు అప్లికేషన్ లా వుంది అంటూ జోక్ లు పేలాయి. అప్పటికీ యాంకర్ సుమ అక్కడే కామెంట్ చేసారు. టోటల్ బయోపిక్ వచ్చేసింది అంటూ.
పాపం, బన్నీవాస్ సిగ్గుపడి, తనకు తెలియదు ఇంత వుంటుందని, తెలిస్తే కట్ చేయించేసేవాడిని అనేసాడు కూడా. ఫంక్షన్ లు చేసేవారు అతి బిల్డప్ ల కోసం ఇలా చేస్తే కామెంట్లు, మీమ్స్ పడేది సెలబ్రిటీల మీదే. అదే గుర్తుంచుకోవాలి.