నో చెప్పాలని ఫిక్స్ అయి ఓకే చెప్పిన నాని

టక్ జగదీశ్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు నాని. దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథను తిరస్కరించాలని ఫిక్స్ అయ్యాడట ఈ హీరో. కానీ తప్పనిసరి పరిస్థితుల మధ్య ఓకే చెప్పానని అన్నాడు.…

టక్ జగదీశ్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు నాని. దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథను తిరస్కరించాలని ఫిక్స్ అయ్యాడట ఈ హీరో. కానీ తప్పనిసరి పరిస్థితుల మధ్య ఓకే చెప్పానని అన్నాడు.

“శివ నిర్వాణ ఫోన్ చేసి స్టోరీలైన్ చెబుతానన్నాడు. మరోసారి లవ్ స్టోరీ పట్టుకొస్తాడని అనిపించింది. అందుకే ఎలాంటి కథ చెప్పినా నో చెప్పేయాలని ఫిక్స్ అయి మరీ రమ్మన్నాను. కానీ వచ్చిన తర్వాత టక్ జగదీశ్ కథ చెప్పాడు. ఆ స్టోరీ విన్న తర్వాత ఇక నో చెప్పలేకపోయాను. కథ చెప్పిన 10 నిమిషాలకే ఓకే చెప్పాను.”

ఇలా టక్ జగదీశ్ సినిమా కథ తనను బాగా కదిలించిందన్నాడు నాని. అటు దర్శకుడు శివ నిర్వాణ కూడా ఈ యాంగిల్ పై స్పందించాడు. నానికి కథ చెబితే అది లవ్ స్టోరీ మాత్రం కాకూడదని ముందుగానే ఫిక్స్ అయ్యాడట శివ. సో.. వీళ్లిద్దరి మాటలతో టక్ జగదీశ్ సినిమా లవ్ స్టోరీ కాదనే విషయం తేలిపోయింది.

ఇక సినిమాలో హీరోయిన్ ఎంపిక కూడా విచిత్రంగా జరిగింది. ఇందులో హీరోయిన్ గా చాలామంది పేర్లు అనుకున్నాడు దర్శకుడు. కానీ నాని మాత్రం రీతూ వర్మ పేరు చెప్పి, ఆమెనే తీసుకునేలా పట్టుబట్టాడట.

టక్ జగదీష్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అది మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. ట్రయిలర్ ఎప్పుడొస్తే, అప్పుడే ట్రయిలర్ తో పాటు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామన్నాడు నాని.