తిరుప‌తి ప్ర‌జాతీర్పును పాక్షిక దృష్టితో ఎలా చూస్తారు?

తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మామూలుగా అయితే మేము గెలుస్తాము అంటే మేము గెలుస్తాము అని రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళ, ప్రతి సవాళ్ల ఉంటాయి. నేడు అందుకు భిన్నంగా…

తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మామూలుగా అయితే మేము గెలుస్తాము అంటే మేము గెలుస్తాము అని రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళ, ప్రతి సవాళ్ల ఉంటాయి. నేడు అందుకు భిన్నంగా భారీ మెజారిటీతో అధికార పార్టీ గెలుస్తుందని అందుకు దొంగ ఓట్లు కారణం అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. స్థూలంగా జరుగుతున్న చర్చ గెలుపు ఖాయం. కానీ అది ప్రజల ఓట్లతోనా దొంగ ఓట్లతోనా అన్నదే చర్చనీయాంశంగా మారింది. 

తిరుపతి అసెంబ్లీ పరిధిలో జరిగిన పోలింగ్ తీరుపై విపక్షాల విమర్శలను పరిగణనలోకి తీసుకోవాలీసిందే. ఎన్నికల కమిషన్ ఆరోపణలకు తగిన సమాధానం చెప్పాలి. 7 నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ ఫలితాన్ని ఒక నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటనలు ఆధారంగా మొత్తం ఫలితానికి ముడిపెట్టి విమర్శలు చేయడం సరికాదు. 7 నియోజకవర్గాల  పరిధిలో తిరుపతి పార్లమెంట్ ఉంటుంది. మొత్తం ఓట్లు 17,10699  నేడు 64.89 శాతం నమోదుతో 1099784 ఓట్లు నమోదయినది. 

ఇందులో అత్యధికంగా సత్యవేడు నుంచి 72.68 శాతం కాగా అత్యల్పంగా తిరుపతి నుంచి 50.58 శాతం నమోదయినది. తిరుపతిలో నమోదయిన ఓట్లు పోలైన ఓట్లలో 12.8 శాతం మాత్రమే. మిగిలిన 6 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 88 శాతం. 

తిరుపతి లో 142814 ఓట్లు నమోదు కాగా మిగిలిన 6 నియోజకవర్గాలలో 956970 ఓట్లు నమోదయినది.  ప్రతిపక్ష పార్టీలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తుంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన పోలింగ్ తీరుపై. రిపోలింగ్ డిమాండ్ కూడా తిరుపతి నగరంలోని భూతులలో మాత్రమే. మిగిలిన చోట్ల ఇలాంటి డిమాండ్ కూడా చేయడం లేదు. 

ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకున్నా తిరిగి ఎన్నికలు జరిగేది కేవలం తిరుపతి నగరంలో మాత్రమే. 88 శాతం ఫలితంపై ప్రతిపక్ష పార్టీలు అప్పుడే ఎందుకు చేతులెత్తేసినాయి. వచ్చే మెజారిటీ దొంగ ఓట్లు అన్న ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల బలహీనతని చెప్పక తప్పదు. 

ప్రతిపక్ష పార్టీల డిమాండ్ మేరకు తిరుపతి పరిధిలో తిరిగి ఎన్నికలు నిర్వహించకపోయినా ఎన్నికల లెక్కింపు నియోజకవర్గాల ప్రాతిపదికన జరుగుతుంది. అప్పుడు తిరుపతి మెజార్టీని మినహాయింపు ఇచ్చి మిగిలిన ఫలితాన్ని అంగీకరించక తప్పదు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో తీర్పును ప్రజా తీర్పు అనుకోకపోయినా 6 నియోజకవర్గాల నుంచి వెలువడనున్న తీర్పు ప్రజా తీర్పు కాకుండా ఎందుకు పోతుంది.

-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, రాజకీయ విశ్లేషకులు, తిరుపతి, 9490493436.