సాహోలో ఎయిర్ టెల్ అమ్మడు

సాషా చెత్రీ అన్న పేరు కొత్తగా వుండొచ్చు. కానీ ఎయిర్ టెల్ ఫోర్ జీ పిల్ల అంటే జనాలకు టక్కున ఓ యూత్ ఫుల్, ఫన్నీ ఆటిట్యూడ్, బ్యూటిఫుల్ అమ్మాయి ఫేస్ కళ్ల ముందుకు…

సాషా చెత్రీ అన్న పేరు కొత్తగా వుండొచ్చు. కానీ ఎయిర్ టెల్ ఫోర్ జీ పిల్ల అంటే జనాలకు టక్కున ఓ యూత్ ఫుల్, ఫన్నీ ఆటిట్యూడ్, బ్యూటిఫుల్ అమ్మాయి ఫేస్ కళ్ల ముందుకు వస్తుంది. ఆ అమ్మాయి ఇప్పటికే టాలీవుడ్ లోకి వచ్చేసింది. అడవి సాయికిరణ్ రూపొందిస్తున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయే.

వెదికి వెదికి మరీ ఆ అమ్మాయిని పట్టుకుని ఒప్పించి తీసుకువచ్చారు టాలీవుడ్ కు అడవి సాయికిరణ్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే మరో మాంచి చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో యువి క్రియేషన్స్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న భారీ సినిమా సాహో. దాదాపు మూడు వందల కోట్ల సినిమా ఇది.

ఈ సినిమాలో ఓ కీలకపాత్రకు ఛెత్రీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన హీరోయిన్ లాంటి క్యారెక్టర్ అయితే కాకపోవచ్చు. కానీ సాహో లాంటి ప్రాజెక్టులో పార్ట్ కావడం అంటే, కచ్చితంగా అందరి దృష్టి ఇప్పుడు ఆ అమ్మాయి మీద పడుతుంది. అది ఆమెకు, ఫస్ట్ సినిమా గోల్డ్ ఫిష్ కు ప్లస్ అవుతుంది.