సినీ నటి రష్మిక, జగిత్యాల కలెక్టర్ రవి మధ్య ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. హీరోయిన్ రష్మిక మందన తన లేటెస్ట్ ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది. తన ఆనందాన్ని అభిమానులతో ఆమె పంచుకున్నారు. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. నెటిజన్లలో ఒక వ్యక్తి కామెంట్ అందరినీ ఆకర్షించింది.
రష్మికను ఉద్దేశించి.. “చించేశావ్ పో” అంటూ జగిత్యాల కలెక్టర్ రవి పేరుతో వచ్చిన ట్వీట్ దుమారం రేపుతోంది. బాధ్యతగల ఒక జిల్లా కలెక్టర్ ఈ విధంగా కామెంట్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. ఈ విషయం ఆనోట ఈనోట పోయి కలెక్టర్ చెవిన పడింది. ఈ ట్వీట్‌పై జగిత్యాల కలెక్టర్ రవి స్పందించారు.
ఈ ట్వీట్ చేసింది తాను కాదని, తన ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని ఆయన కోరారు. కలెక్టర్ ట్విటర్ అకౌంట్‌ను ఎవరు హ్యాక్ చేశారనే దానిపై చర్చ సాగుతోంది. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది.
'విజయనిర్మల' గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సూపర్‌స్టార్ కృష్ణ