పార్టీ ప్రచారానికే పార్ట్ 2?

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వుంటుందని కొన్నినెలల క్రితమే వెల్లడిస్తే చాలామంది ప్యూర్ గ్యాసిప్ అనుకున్నారు. నమ్మలేదు. కొద్దిరోజుల క్రితమే పేర్లు కూడా వెల్లడించాం. జస్ట్ టూ డేస్ బ్యాక్ నే తక్కువ గ్యాప్…

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వుంటుందని కొన్నినెలల క్రితమే వెల్లడిస్తే చాలామంది ప్యూర్ గ్యాసిప్ అనుకున్నారు. నమ్మలేదు. కొద్దిరోజుల క్రితమే పేర్లు కూడా వెల్లడించాం. జస్ట్ టూ డేస్ బ్యాక్ నే తక్కువ గ్యాప్ తో రెండు భాగాలు విడుదలవుతాయని న్యూస్ అందించాం. 

ఇప్పుడు యూనిట్ నుంచే క్లారిటీ వచ్చింది. ఓ టైటిల్ బయటకు వచ్చింది. ఇక రావాల్సింది రెండో టైటిల్. రెండు డేట్ లు. ఇదిలా వుంటే రెండోభాగం కాస్త డ్రయ్ గా వుంటుంది. ఎన్టీఆర్, సంక్షేమపథకాలు, ఆయన చేసిన ప్రగతి, ఆయన రాజకీయ, సంక్షేమ ఆలోచనా విధానం ఇలాంటివి వుంటాయి. ఈ రెండోభాగం జనవరి 24న విడుదులవుతుంది.

ముఖ్యంగా ఈ రెండోభాగం ఎన్నికల ప్రచారాన్ని టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. ఊరూరా ఎన్నికల సమయంలో నేరుగా ఎక్కడపడితే అక్కడ సినిమాను ఫ్రదర్శించుకునేందుకు ఆలోచన వుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో నిత్యం ఏదో ఒక ఫొటోతో ఎన్టీఆర్ ను గుర్తు చేస్తూనే వుంటుంది.

ఎన్నికల టైమ్ లో కూడా ఎన్టీఆర్ ను జనాలకు గుర్తుచేయడం అన్నది కాస్త పాజిటివ్ ఆలోచనే. అందుకే ఈ రెండోభాగం ప్లానింగ్ అని వినిపిస్తోంది. ఇప్పడు అంతా డిజిటల్ యుగం. సినిమాను సులువుగా ఎక్కడయినా ప్రదర్శించేయవచ్చు. ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లవచ్చు.

టికెట్ పెట్టి చూడమంటే కష్టం కానీ, ఎన్నికల టైమ్ లో ఫ్రీగా చూపిస్తే, చూడనిదెవరు? రెండు భాగాల బడ్జెట్ తొలి భాగంలో వచ్చేస్తే, మలిభాగం మీద భారం వుండదు. అందుకే మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే రెండు మూడు వారాల గ్యాప్ లో రెండోభాగం కూడా వదిలేసే ఆలోచన చేస్తున్నారు.