నోటా ప్రీరిలీజ్ బిజినెస్ డిటైల్స్

నోటా మరో కొన్నిగంటల్లో థియేటర్లోకి వస్తోంది. ఈ మధ్యకాలంలో అంత షార్ట్ టైమ్ లో పబ్లిసిటీ స్టార్ట్ చేసి, క్రేజ్ ను పీక్స్ కు తీసుకెళ్లిన సినిమా ఇదే. ఆఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ…

నోటా మరో కొన్నిగంటల్లో థియేటర్లోకి వస్తోంది. ఈ మధ్యకాలంలో అంత షార్ట్ టైమ్ లో పబ్లిసిటీ స్టార్ట్ చేసి, క్రేజ్ ను పీక్స్ కు తీసుకెళ్లిన సినిమా ఇదే. ఆఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ టైమ్ అలా వుంది. జ్ఞాన్ వేల్ రాజా పబ్లిసిటీ అలా వుంది. అయితే అసలు ఈ సినిమాకు ఎంతయింది? ఈ సినిమాతో తన బ్యానర్ కింగ్ ఆఫ్ హిల్స్ ను తొలిసారి అనౌన్స్ చేసాడు విజయ్ దేవరకొండ. దాని లెక్కేమిటి?

నోటా సినిమా నిర్మాణ వ్యయం, వడ్డీలు కలుపుకుని 13కోట్లు అయింది. దర్శకుడికి జీతం ప్లస్ లాభాల్లో వాటా పెట్టారు. హీరో విజయ్ దేవరకొండకు కోటిపాతిక లక్షల రెమ్యూనిరేషన్ ప్లస్ లాభాల్లో వాటా పెట్టారు. డిజిటల్, హిందీ డబ్బింగ్, తదిరత వ్యవహారాలతో ఆరుకోట్ల వరకు రికవరీ వచ్చింది. ఇంకా ఏడుకోట్లు ప్లస్ విడుదుల ఖర్చులు మరో మూడు నుంచి అయిదు కోట్లు రావాలి. అంటే సుమారు పది నుంచి పన్నెండు కోట్ల బర్డెన్ వుంది.

సినిమా తమిళ్, మళయాలం, తెలుగు, కన్నడనాట విడుదలవుతోంది. తెలుగులో ఎక్కడా సినిమాను అమ్మలేదు. ఏషియన్ సునీల్, దిల్ రాజు, అల్లు అరవింద్, యువి వంశీలతో సినిమాను డైరక్ట్ రిలీజ్ చేసుకుంటున్నారు నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా. అదే విధంగా శాటిలైట్ కూడా ఇంకా ఇవ్వలేదు.

సో టోటల్ రైట్స్ వున్నాయి. రిస్క్ పది నుంచి పన్నెండు కోట్లు వుంది. ఫస్ట్ వీకెండ్ లో ఒక్క తెలుగునాట కలెక్షన్లతోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇక హిట్ టాక్ వస్తే, కాసుల పంటే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు.

తమిళనాట ఉదయం అయిదుగంటలకు ప్రీమియర్లు వేయడం విశేషం. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకే ఇలా చేస్తారు అక్కడ. సో. నోటా క్రేజ్, బిజినెస్ ఓ రేంజ లో వుండేలాగే వుంది.