మిస్ యూనివర్స్ అంటే ప్రపంచం మెచ్చిన ముద్దుగుమ్మ అని అర్థం. ఎన్నో దేశాల నుంచి పోటీపడిన అందగత్తెల్ని దాటి, కిరీటాన్ని ఎగరేసుకుపోయిన ముద్దుగుమ్మ అని మీనింగ్. ఇంకా చెప్పాలంటే, ఈ యూనివర్స్ మెచ్చిన బ్యూటీ అని అర్థం. మరి అలాంటి అందగత్తెకు కూడా సౌందర్య శస్త్రచికిత్స (కాస్మొటిక్ సర్జరీ) అవసరమా?
అవుననే అంటున్నారు కొంతమంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం సుశ్మితా సేన్.
మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకొని ఇండియా గర్వపడేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. సుశ్మితా సేన్ అందం మరొకరికి రాదంటూ ఆమెపై వచ్చిన పొగడ్తలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి అందగత్తె కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందనే ప్రచారం బాలీవుడ్ లో నడుస్తోంది.
తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైంది సుశ్మితాసేన్. ఆ కార్యక్రమంలో ఆమె ఉబ్బిన మొహంతో కనిపించింది. ఇంకా చెప్పాలంటే ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. దీంతో మాజీ మిస్ యూనివర్స్ కు కూడా కాస్మొటిక్ సర్జరీ తప్పలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.
రాఖీ సావంత్ తో పోలిక..
కొంతమంది సుశ్మిత సేన్ కొత్త గెటప్ చూసి రాఖీ సావంత్ తో పోలుస్తున్నారు. “నేను చూస్తున్నది సుశ్మితానా లేక రాఖీ సావంత్ నా” అనే పోస్టులు తెగ పడ్డాయి. నిజమే, ఉబ్బిన మొహంతో రాఖీ సావంత్ లా కనిపిస్తోంది సుశ్మిత సేన్. 47 ఏళ్ల వయసులో అందం కోసం ఆమె శస్త్రచికిత్స చేసుకోవడం అవసరమా అని మరికొంతమంది అడుగుతున్నారు.
అసలు మేటర్ ఇదీ..?
అయితే అసలు మేటర్ మాత్రం వేరే ఉంది. ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించుకోలేదని అంటున్నారు సుశ్మిత దగ్గరి జనం. రీసెంట్ గా సుశ్మితా సేన్ గుండెపోటుకు గురైంది. ఆ టైమ్ లో కొన్ని వారాల పాటు ఆమె వైద్యుల పర్యవేక్షణలో మందలు తీసుకుంది. ఆ మందుల ప్రభావం వల్ల సుశ్మితాసేన్ ముఖం మారిపోయిందంటున్నారు తెలిసినవాళ్లు.
ఈ వాదనే కనుక నిజమైతే.. మరికొన్ని రోజుల్లో సుశ్మితాసేన్ తన మునుపటి రూపాన్ని సొంతం చేసుకుంటుంది. అలా జరక్కపోతే మాత్రం ఆమె తన ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుందని అర్థం.