తిరుప‌తి పోలింగ్ వివ‌రాలివే…

వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. Advertisement తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌తో సంబంధం లేకుండానే మొట్ట మొద‌ట‌గా బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది.…

వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌తో సంబంధం లేకుండానే మొట్ట మొద‌ట‌గా బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. త‌న మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌తో క‌లిసి తిరుప‌తిలో పాగా వేసి, రానున్న 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని గొప్ప‌లు చెప్పింది.

ప్ర‌ధాన పోటీదారులైన వైసీపీ, టీడీపీ నేత‌లు మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ వచ్చారు. మొత్తానికి పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. శ‌నివారం సాయంత్రం ఏడు గంట‌ల‌కు పోలింగ్ ముగిసింది.

తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో మొత్తం 64.44 శాతం పోలింగ్ న‌మో దైంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట్‌లో 79.03% న‌మోదైంది. గ‌తంతో  పోలిస్తే… తాజా ఎన్నిక‌ల్లో 14.59% త‌క్కువ పోలింగ్ న‌మోదైంది. అయితే అనేక కార‌ణాల రీత్యా ఈ మాత్రం  ఓటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని రాజ‌కీయ పార్టీలు ఊహించ‌లేదు.

ఇదిలా ఉండ‌గా ఈ రోజు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా 72.68 శాతం న‌మోదైంది. ఆ త‌ర్వాత స్థానాన్ని 70.93 శాతంతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గం ద‌క్కించుకుంది. ఇక మిగిలిన ఐదు నియోజ‌క వ‌ర్గాల్లో న‌మోదైన పోలింగ్ వివ‌రాలిలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో 66.19%, గూడూరులో 63.81%, వెంక‌ట‌గిరిలో 59.17%, చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో 67.77%, తిరుప‌తిలో 50.58% పోలింగ్ న‌మోదైంది. మొత్తం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 64.44% న‌మోదు కావ‌డం విశేషం. కాగా పోలింగ్ న‌మోదు వివ‌రాల‌ను ఎన్నిక‌ల సంఘం ధ్రువీక‌రించాల్సి వుంది.