సురేష్ థియేటర్లు క్లోజ్

కరోనా కల్లోలం మామూలుగా లేదు. సినిమాలు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. థియేటర్లపై ఆంక్షలు లేకున్నా, ప్రదర్శించాలి అంటే సినిమాలు లేవు. రన్నింగ్ లో వున్న సినిమాల కలెక్షన్లు దారుణంగా వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రలో…

కరోనా కల్లోలం మామూలుగా లేదు. సినిమాలు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. థియేటర్లపై ఆంక్షలు లేకున్నా, ప్రదర్శించాలి అంటే సినిమాలు లేవు. రన్నింగ్ లో వున్న సినిమాల కలెక్షన్లు దారుణంగా వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రలో టికెట్ ల జీవో కూడా వచ్చింది. దాంతో థియేటర్లను మూత పెట్టడం ప్రారంభమైంది.

ఆంధ్రలో తమకు వున్న థియేటర్లలో ముఫై నుంచి నలభై వరకు క్లోజ్ చేసింది సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ. విశాఖలో కీలకమైన జ్యోతి థియేటర్ ను కూడా మూసేసారు. 

కాకినాడలో అరడజను థియేటర్ల వరకు మూసేసారు. చాలా మంది సింగిల్ ఓనర్లు కూడా ఇదే పని చేస్తున్నారు. థియేటర్ల ముందు ప్రస్తుతం సినిమాలు లేక మూసి వేయడమైనది అనే బోర్టులు దర్శనమిస్తున్నాయి. 

తెలంగాణలో ఇంకా ఆ పరిస్థితి అంతగా లేదు. త్వరలో ఇక్కడ కూడా అదే పరిస్థితి వుంటుందని తెలుస్తోంది. వకీల్ సాబ్ లాంటి సినిమానే రెండోవారం వచ్చాక చాలా చోట్ల డల్ అయిపోయింది. 

ఇక వేరే సినిమాల సంగతి చెప్పనక్కరేలేదు. అందువల్ల ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండానే థియేటర్లు క్లోజ్ అవుతున్నాయి.