అదిగో పులి అంటే ఇదిగో తోక అనడంలో తెలుగు తమ్ముళ్ళు మించిపోయారా. అభివ్రుధ్ధిని కూడా రాజకీయం చేసి చూపిస్తూ అడ్డుకుంటున్నారా. మేము రాజులుగా ఉంటేనే అభివ్రుధ్ధి.. అన్నీ ఉండాలి, లేకపోతే ఏపీ నుంచి అన్నీ తరలిపోవాలి..ఇదేనా తమ్ముళ్ళ విధానం.
దీన్ని వైసీపీ మంత్రి మేకపటి గౌతంరెడ్డి బాగా ఎండగట్టారు. విశాఖ నుంచి ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చంద్రబాబు ఆయన గ్యాంగ్ చేస్తున్నాయని మండిపడ్డారు.
విశాఖను ఐటీ రాజధానిగా చేద్దామనుకుంటున్నామని, అలాటిది ఉన్న ఐటీ పరిశ్రమలను ఎందుకు పంపించివేస్తామని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖలో అన్ని రకాలుగా ఐటీ వాతావరణం ఉందని, దాన్ని తాము అందిపుచ్చుకుని అభివ్రుధ్ధి చేస్తామని ఆయన క్లారిటీగా చెప్పారు.
ఇక విశాఖలో ఆదానీ డేటా సెంటర్ గురించి టీడీపీ చెబుతున్న గొప్పలు తప్పు అంటున్నారు గౌతంరెడ్డి. కేవలం మూడు వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి ఆదామీ గ్రూప్ ప్రతిపాదించిందని, దాన్ని 70 వేల కోట్ల పెట్టుబడులుగా చూపించడం టీడీపీ పెద్దలకే చెల్లిందని ఆయన ఫైర్ అయ్యారు.
ఇక పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో ఒక విధానం అంటూ లేకుండా నాటి టీడీపీ సర్కార్ వ్యవహరించిందని, శక్తికి మించి రాయితీలు ప్రకటించి 4,600 కోట్ల బాకీలు పెట్టి వెళ్ళిందని కూడా అయన చెప్పుకొచ్చారు. వాటిని పరిశీలించి క్లియర్ చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కూడా చెప్పారు.
ఇక విశాఖ ఐటీ టవర్స్ లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఎక్కడికీ పోవని కూడా గౌతం రెడ్డి స్పష్టం చేసారు. కాబట్టి విశాఖ ఐటీ గురించి టీడీపీ తమ్ముళు అతి మాటలు, మతి మాలిన మాటలు మానుకోవడం మంచిదని సూచిస్తున్నారు.