త్రివిక్రమ్-మళ్లీ అదే తప్పు

హారిక హాసిని అనే స్కూలుకు ప్రిన్సిపాల్ త్రివిక్రమ్. అక్కడ ఆయన కూర్చో అంటే కూర్చో.. నిల్చో అంటే నిల్చో. సినిమాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయం ఆయనదే. అలా అని టీజర్ ఎప్పుడు, ట్రయిలర్…

హారిక హాసిని అనే స్కూలుకు ప్రిన్సిపాల్ త్రివిక్రమ్. అక్కడ ఆయన కూర్చో అంటే కూర్చో.. నిల్చో అంటే నిల్చో. సినిమాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయం ఆయనదే. అలా అని టీజర్ ఎప్పుడు, ట్రయిలర్ ఎప్పుడు, ఫంక్షన్ ఎప్పుడు అనే క్వశ్చన్లు కూడా వుండవు. ఆయనంతట ఆయన చెప్పేదాకా వెయిట్ చేయడమే.  

కానీ పెద్ద సినిమాలకు, పెద్ద హీరోల సినిమాలకు పబ్లిసిటీ వ్యవహారం అనేది ఒకటి వుంటుంది. ఫ్యాన్స్ కు రకరకాల స్టిల్స్ కావాలి. తరచు అప్ డేట్ లు కావాలి. ఏం జరుగుతోందో తెలియాలి. అందుకోసం సినిమాకు అభిమానులకు మధ్య వారథిగా పీఆర్వో వుంటారు.

కానీ త్రివిక్రమ్ సినిమాకు పీఆర్వోలు కూడా దాదాపు చేష్టలుడిగి వుండాల్సిందే. ఏమీ చెప్పడానికి, చేయడానికి వారి చేతిలో ఏమీవుండదు. అరవింద సమేత వీరరాఘవ సినిమాకు ఎన్టీఆర్ స్వంత పీఆర్ యూనిట్ వుంది. హారిక హాసినికి స్వంత పీఆర్ యూనిట్ వుంది. రెండు యూనిట్ లు వున్నా కూడా సినిమాకు సరైన పబ్లిసిటీ లేదు. ట్విట్టర్ లో అభిమానుల గోల ఇంతాఅంతా కాదు. అప్ డేట్స్ ఇవ్వమని, మాంచి స్టిల్స్ వదలమని.

కానీ ఈ విషయం త్రివిక్రమ్ వరకు తీసుకెళ్లే ధైర్యం ఎవరికీలేదు. అరవింద సమేత వీరరాఘవకు సరైన పబ్లిసిటీ జరగడం లేదన్న విషయాన్ని హారిక హాసిని జనాల దృష్టికి కూడా ఇండస్ట్రీ జనాలు తీసుకెళ్లారని వినికిడి.. ఎన్టీఆర్ పీఆర్ యూనిట్ ఆ పని చూసుకుంటోందని తమకు ఏం తెలియదని సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఎన్టీఆర్ పీఆర్ యూనిట్ వద్ద కూడా కొందరు ప్రస్తావించినట్లు, దానికి వారి దగ్గర మౌనమే సమాధానం అయినట్లు తెలుస్తోంది.

అరవింద ట్రయిలర్ వ్యవహారం కూడా అంతే. 2న విడుదల చేయాలన్నది ముందుగా డిసైడ్ చేసారు. కానీ ఒకటవతేదీ వరకు అసలు ట్రయిలర్ కట్ నే జరగలేదని తెలుస్తోంది. ఆఖరికి 1న లేటుగా కట్ చేసి, మిగిలిన పనులకు పంపారు. పైగా అక్కడ ఆర్ ఆర్ చేయాల్సింది థమన్ బాబు. ఆయన ఒక అంతట ఫినిష్ చేయరని ఇండస్ట్రీ టాక్. అందుకే విడుదలను రెండవ తేదీ రాత్రి 8.10కి అని డిసైడ్ చేసారు. మళ్లీ ఎంతకూ విడుదల చేయరేమని ఫ్యాన్స్ ట్రోల్ చేయకుండా.

పీఆర్ యూనిట్లకు కాస్త ఫ్రీ హ్యాండ్ ఇస్తే, సినిమా ప్రచారం ఓ రేంజ్ లో వుంటుంది. అదే త్రివిక్రమ్ స్టయిల్ ఇనుప కంచె మాదిరిగా వుంటే ఇలాగే వుంటుంది.