నవాబ్-నాన్నా పులి

నాన్నా పులి కథ తెలుసు కదా? ఒకసారి నమ్ముతారు. రెండుసార్లు నమ్ముతారు. మూడోసారి నమ్మరు. మణిరత్నం సినిమాలను నమ్మారు… నమ్మారు… చూసి నీరసించారు. నిజంగా ఆయన మంచి సినిమా తీసారు. నవాబ్ అంటూ. కానీ…

నాన్నా పులి కథ తెలుసు కదా? ఒకసారి నమ్ముతారు. రెండుసార్లు నమ్ముతారు. మూడోసారి నమ్మరు. మణిరత్నం సినిమాలను నమ్మారు… నమ్మారు… చూసి నీరసించారు. నిజంగా ఆయన మంచి సినిమా తీసారు. నవాబ్ అంటూ. కానీ జనం చూడడంలేదు. మణిరత్నం సినిమా కదా మళ్లీ ఏదో ఆయన చిత్తానికి తీసి వుంటారని డిసైడ్ అయిపోయి వదిలేసారు.

నిజానికి నవాబ్ అన్ని విధాల మంచి సినిమా. తమిళనాట పెద్ద హిట్ అయింది. ఓవర్ సీస్ లో బాగుంది. కానీ తెలుగునాట అంతంత మాత్రంగా వుంది. నిజానికి మణిరత్నం సినిమా అంటే ఒకప్పుడు తెలుగునాట పెద్ద నిర్మాతలు ఎగబడేవారు. దిల్ రాజు కూడా మణిరత్నం సినిమాలు తీసుకున్నవారే. అలాంటిది, నవాబ్ ను అందరూ అనాధలా వదిలేసారు. దాంతో మణిరత్నం మీద అభిమానంతోనో, ఆయన సినిమాల మీద అభిమానంతోనో కొత్త నిర్మాత దాన్ని తీసుకున్నారు.

అంతవరకు ఒకే కానీ ఆయన సరైన విధంగా ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అందుకు ఆయన అనుభవం సరిపోయినట్లు లేదు. పైగా లైకా సంస్థ సినిమా ప్రచారాన్ని విడుదల ముందు తలకెత్తుకుని, ఆ తరువాత వదిలేసింది. అప్పటికీ అరవింద్ స్వామి ఓరోజు ప్రచారానికి ఇక్కడ కేటాయించినా పెద్దగా ఫలితం కనిపించలేదు.

అయితే నవాబ్ అదృష్టం ఏమిటంటే, మరీ నీరస పడిపోలేదు. నాలుగు అంకెల స్థాయికి దిగిపోలేదు. అయిదు అంకెలలో నడుస్తున్నాయి థియేటర్ల కలెక్షన్లు. కానీ సమస్య ఏమిటంటే, అయిదున, పదకొండున వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. అందువల్ల ఇక నవాబ్ ను లేపాలి అంటే కాస్త కష్టమే.