పవన్ ఫొటో విడుదల వెనుక

లాభం లేకుండా ఏ వ్యాపారి కూడా వరద జోలికి పోడు అన్నది సామెత. తెలుగు సెలబ్రిటీలు సాధారణంగా తన పర్సనల్ లైఫ్ ను వీలయినంత గోప్యంగా వుంచుతారు. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్…

లాభం లేకుండా ఏ వ్యాపారి కూడా వరద జోలికి పోడు అన్నది సామెత. తెలుగు సెలబ్రిటీలు సాధారణంగా తన పర్సనల్ లైఫ్ ను వీలయినంత గోప్యంగా వుంచుతారు. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ కరోనా సోకిన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో? కానీ తమకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన టాలీవుడ్ సెలబ్రిటీలు పట్టుమని పది మంది వుండరు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పర్సనల్ విషయాలు అన్నీ చాలా గుట్టుగా వుంచుతారు. ఆ మధ్య కరోనా కారణంగా ఐసోలేషన్ లోకి వెళ్లారని ప్రకటించారు తప్ప, అక్కడ పుస్తకాలు చదువుతున్నట్లో? ఒంటరిగా వున్నట్లో ఫొటోలు వదలేదు. కానీ అలాంటిది ఇప్పుడు వున్నట్లుండి ఫొటో అది కూడా మంచం మీద ఆక్సిజన్ తీసుకుంటూ వదిలారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కు కొవిడ్ నెగిటివ్ వచ్చింది. కానీ జ్వరం వస్తుండడంతో, టెనెట్ టెస్ట్ సెంటర్ కు తీసుకెళ్లి సిటి స్కాన్ చేయించారు. అక్కడ చిన్న ఇన్ ఫెక్షన్ వుందని బయటపడింది. అంతకు మించి మరేం లేదు. సరే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కనుక, అపోలో చేతిలో వుంది కనుక ఏర్పాట్లు చేసుకున్నారు తప్పులేదు.

కానీ అర్జెంట్ గా ఫొటో ఎందుకు వదిలినట్లు? తెల్లవారితే తిరుపతి ఉపఎన్నిక. అక్కడ సానుభూతి ఓట్లు భాజపాకు ఈ విధంగా రప్పించాలని అనుకుంటున్నారా? ఇలా అనుమానపడడం తప్పు అనడానికి లేదు.  

భాజపా మహా మహులే బెంగాల్ లో మమత బెనర్జీ కాలిగాయం పట్ల ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసారు.అందులోనూ పవన్ భలే తెలివైన వారు. సమయాన్ని బట్టి డ్రెస్సింగ్, గెటప్ విషయంలో చాలా ప్లాన్డ్ గా వుంటారు. అందువల్లే ఇప్పుడు ఈ ఫొటో అర్జెంట్ గా వదలడం మీద కూడా సందేహంగా వుంది.