ఉక్కు పోరాటంలో ఎక్కాల్సిన మెట్లు ఎన్నో..?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అయిదు దశాబ్దాల క్రితం ఉవ్వెత్తుల సాగిన పోరాట ఫలితంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ దిగి వచ్చారు. ఇపుడు అదే ఉక్కును బలిపీఠం మీద కేంద్రం పెట్టేసింది. Advertisement…

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అయిదు దశాబ్దాల క్రితం ఉవ్వెత్తుల సాగిన పోరాట ఫలితంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ దిగి వచ్చారు. ఇపుడు అదే ఉక్కును బలిపీఠం మీద కేంద్రం పెట్టేసింది.

నాటికీ నేటికీ ఒక్కటే పోలిక ఉంది. నాడు ఇందిర ఉక్కు మహిళగా ఉన్నారు. అప్పటికే ఆమె అజేయమైన విజయాలతో గట్టి నేతగా దేశంలో ఉన్నారు. ఇపుడు అదే స్థానంలో ప్రధాని మోడీ కూడా ఉన్నారు. ఆయన సైతం తాను తలచుకుంటే  ముందుకే అన్నట్లుగా రాజకీయ దూకుడు చేస్తున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపడం సాధ్యమేనా అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేట్ అని అన్న నాటి నుంచి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 

తాజాగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కేంద్ర సర్కార్ వైఖరి మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీన్ని తొలి విజయంగా కొందరు అభివర్ణిస్తున్నారు. అయితే మేధావులు మాత్రం ఉక్కు పోరాటం ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయాలని అంటోంది. 

సహజంగా ప్రతివాదులకు కోర్టులు నోటీసులు ఇస్తాయి. వాటికి వారు జవాబులు కూడా ఇస్తారు. ఇపుడు కేంద్రం తమ పాలసీ ప్రకారమే ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామని చెబితే అపుడు ఉక్కు భవితవ్యం ఏంటి అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఉక్కు పోరాటాన్ని ఏపీవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించినట్లైతేనే తప్ప కేంద్రం దృష్టికి ఈ సమస్య పోదు, పరిష్కారం కూడా రాదు అన్నదే ప్రజా సంఘాల, మేధావుల మాటగా ఉంది.