కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళానికి చెందిన బలమైన బీసీ నేత. పైగా ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. అచ్చెన్నాయుడు అయిదు సార్లు ఎమెల్యేగా, అయిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు.
అటువంటి రాజకీయ అనుభవశాలి నోట వచ్చిన మాట మీద ఇపుడు సొంత పార్టీలోనూ బయట పార్టీలలోనూ ఒకటే చర్చ సాగుతోంది. అది ఫేక్ వీడియో అని అచ్చెన్న స్వయాన ఖండించినా కూడా ఆయన అన్న మాటల తాలూకా ప్రకంపనలు అలాగే కొనసాగుతున్నాయి. అచ్చెన్న నిజమే చెప్పాడు అని వైసీపీ నేతలు అంటూంటే మా నేత మీద అధికార పార్టీ కక్షతో చేస్తున్న ఆరోపణలు ఇవి అంటున్నారు కొందరు తమ్ముళ్ళు.
సరే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా 17 తరువాత అచ్చెన్న ఏంచేస్తాడు అన్న దాని మీదనే ఇపుడు రాజకీయ రచ్చ సాగుతోంది. నిజంగా పార్టీ మీద అంత వైరాగ్యం ఉందా. లేక అసంతృప్తి ని వ్యక్తం చేస్తూనే అచ్చెన్న అలా అన్నారా అన్నది కూడా చర్చగానే ఉంది.
అచ్చెన్న వైసీపీలో చేరుతాడా అని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ గా ట్వీట్ చేసినా కూడా రాజకీయాల్లో మాత్రం ఇపుడు అచ్చెన్న ఆకుల వెంకట్ తో జరిపిన వీడియో సంభాషణ మీదనే అందరి దృష్టి ఉంది.
ఏది ఏమైనా టీడీపీలో కలి పుట్టించిన ఈ వీడియో ఫేక్ అవొచ్చు కానీ అందులో టీడీపీ మీద చెప్పిన మాటలు మాత్రం పచ్చి నిజాలే అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి చూడు పదిహేడు అన్నట్లుగా ఒక రాజకీయ సంచలనానికే అచ్చెన్న తెర తీశారు అన్న మాట అయితే ఉంది.