తమిళంలో రెడీ అవుతున్న సినిమా 96. ఈ సినిమా లైన్, మేకింగ్ నచ్చేసి నిర్మాత దిల్ రాజు హక్కులు కొనేసారు. 1996వ సంవత్సరం స్టూడెంట్స్ మళ్లీ మరోసారి కలిసి, పాత జ్ఞాపకాలు నెమరవేసుకోవడం అనే ఫీల్ గుడ్ లైన్ ఆధారంగా తయారైన సినిమా ఇది. ఈ సినిమాను నాని ప్రత్యేకంగా చెన్నయ్ తీసుకువెళ్లి మరీ చూపించారు నిర్మాత దిల్ రాజు.
దాంతో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు, నానిని హీరోగా ఫిక్స్ చేసేసారు మన జనాలు. అంతేకాదు, హీరోయిన్ గా సమంతను కూడా దింపేసారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇదంతా బుస్.. అని. ఓసారి చూసి ఒపీనియన్ చెప్పమంటే, నాని చెన్నయ్ వెళ్లారు. అంత వరకు ఓకె. అయితే నాని హీరోగా చేస్తారా? లేక ఆ పాత్రకు సూట్ అయ్యే కాస్త మిడ్ ఏజ్డ్ హీరో ఎవరన్నా చేస్తారా? అన్నది ఇంకా తేలలేదు.
అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, సినిమా చూసిన తరువాత ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటే ఎలావుంటుంది అన్న ఆలోచన నానికి వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు. జస్ట్ ఆలోచన మాత్రమే.
96 సినిమా ఫీల్ గుడ్ నే కానీ తెలుగులోకి తేవాలంటే చాలా మార్చాలి. ముఖ్యంగా స్లో పేస్ లో నడిచే స్క్రీన్ ప్లే ను మార్చాలని వినికిడి. దానికి తగిన డైరక్టర్, హీరో సెట్ కావాలి. అందువల్ల చాలా వ్యవహారాలు వున్నాయి.
నాని హీరోనా, సమంత హీరోయిన్ నా అన్నది మాత్రం డవుటే. వుంటేగింటే నిర్మాణంలోకి నాని ఎంటర్ అయ్యే అవకాశాలు మాత్రం వున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే గతంలో ఓసారి నాని అ.. అనే చిన్న సినిమాను నిర్మించారు.