అమ్మంటే కనిపించే దైవమంటారు. అందుకే మాతృదేవో భవ అని తల్లికి దైవం కంటే మొదటి స్థానం కల్పించారు. అలాంటి అమ్మ పుట్టిన రోజంటే బిడ్డలు ఎలా ఫీల్ అవుతారు? ఈ ప్రశ్నకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ను అడిగితే సరైన సమాధానం చెబుతాడు. ఎందుకంటే…ఫిబ్రవరి 18న మెగాస్టార్ చిరంజీవి భార్య, రామ్‌చరణ్ తల్లి అయిన సురేఖ పుట్టిన రోజు కావడం, తన తల్లికి బిడ్డగా అందమైన శుభాకాంక్షలు చెప్పాడు కాబట్టి.
‘నా మొదటి ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. లవ్ యూ అమ్మ’ అంటూ రామ్‌చరణ్ తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు, తల్లితో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అదేవిధంగా చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా తన అత్తకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అత్తమ్మ. లవ్ యూ’ అని పేర్కొంటూ అత్త సురేఖ, భర్త రామ్ చరణ్‌తో దిగిన ఫొటోను మెగా అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమాకు రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ కీలక క్యారెక్టర్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.