రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాత దానయ్య ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా చిత్ర నిర్మాణం చేపట్టాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.
అయితే ఈ సినిమాలో రామచరణ్ పాత్రకు అంత ప్రాధాన్యం లేనట్టుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో రామ్‌చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అన్నట్టు, ఆయన పాత్ర గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడిదే చిరు కోపానికి కారణమైనట్టు సినీ పరిశ్రమ గుసగుసలాడుతోంది.
పులితో ఎన్టీఆర్ ఫైట్, అరకులో ఎన్టీఆర్ షూటింగ్, భారీ ఫైట్ సీక్వెన్స్ అంటూ….ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఏ ఇద్దరూ మాట్లాడుకున్నా ఎన్టీఆర్ తప్ప మరొకరి ప్రస్తావన రావడం లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ అసహనానికి లోనవుతున్నారని తెలిసింది.
చరణ్‌పై రీషూట్?
చరణ్ క్యారెక్టర్‌కు తగిన ప్రాధాన్యత లేకపోవడం, చిరంజీవి అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి అలర్ట్ అయ్యాడని తెలిసింది. రామ్‌చరణ్ క్యారెక్టర్‌కు సంబంధించి రీషూట్ చేపట్టినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రచారంపై దర్శకుడు రాజమౌళి వివరణ ఇస్తే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశమే ఉండదు.