ఆ సినిమా టీజర్ ఎల్లుండే

ఎప్పటి నుంచో అదిగో ఇదిగో అంటూ వార్తల్లో వినిపిస్తున్న సినిమా సవ్యసాచి. ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల లేటయింది. ఆఖరికి పూర్తయింది. ఇప్పుడు టీజర్ విడుదల డేట్ వచ్చేసింది. అక్టోబర్ 1న…

ఎప్పటి నుంచో అదిగో ఇదిగో అంటూ వార్తల్లో వినిపిస్తున్న సినిమా సవ్యసాచి. ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల లేటయింది. ఆఖరికి పూర్తయింది. ఇప్పుడు టీజర్ విడుదల డేట్ వచ్చేసింది. అక్టోబర్ 1న టీజర్ విడుదలకు ముహుర్తం పెట్టారు.

మైత్రీ మూవీస్ బ్యానర్ మీద చందు మొండేటి దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాలో నాగచైతన్య మాంచి యాక్షన్ రోల్ ప్లే చేస్తున్నాడు. అతగాడి సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. నాగ చైతన్యకు ఓ చేయి అతగాడి మాటవినని, డిఫరెంట్ సమస్య వుంటుందని, ఆ అగ్రెసివ్ నెస్ తో అతను ఎలాంటి పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడన్నది ఇప్పుడు టాలీవుడ్ టాక్ గా వుంది.

ఇప్పటివరకు అన్నీ హిట్ లే కొడుతూ, టాలీవుడ్ క్రేజీ బ్యానర్ గా వున్న మైత్రీమూవీస్ సినిమా ఇది. అందువల్ల అన్నీ మంచి అంచనాలే వున్నాయి. టీజర్ విడుదలయితే ఇవి రెట్టింపు అయ్యే అవకాశం వుంది.