బన్నీ-కొరటాల శివ సినిమా వుంటుందా?

నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. బన్నీ తో సినిమా చేయాల్సిన దర్శకుడు కొరటాల శివ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయారు. దీనిపై బన్నీ ప్యాన్స్ బాగా హర్ట్…

నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. బన్నీ తో సినిమా చేయాల్సిన దర్శకుడు కొరటాల శివ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయారు. దీనిపై బన్నీ ప్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఆ ప్రభావం సోషల్ మీడియాలో కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో యువసుధ సంస్థ అర్జెంట్ గా ఓ ట్వీటు వేసేసింది. 

బన్నీ-కొరటాల సినిమా వుందని, ఏప్రిల్ 2022 తరువాత వుంటుందని, ఇది జిఎ2 నిర్మాత సంస్థలో ఓ మ్యూచువల్ అండర్ స్టాండ్ ప్రకారం జరిగిందని పేర్కొంది. అయితే కేవలం ఫ్యాన్స్ దాడిని తాత్కాలికంగా తగ్గించడానికి ఈ ట్వీటు వేసినట్లు కనిపిస్తోంది తప్ప నిజంగా ప్రాజెక్టు వుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల తన ప్రాజెక్టును ఎన్టీఆర్ కు షిప్ట్ చేయడం బన్నీకి తెలిసే జరిగిందనే ప్రచారం కావాలనే జరిగిందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ విషయంలో కొరటాల ఇలా వెళ్లిపోవడంపై బన్నీ కాస్త ఆగ్రహంగానే వున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తరువాత ప్రాజెక్టు మీద క్లారిటీతో వున్నారని తెలుస్తోంది.

ఐకాన్ ప్రాజెక్టు పుష్ప తరువాత వుంటుందనే టాక్ వుంది కానీ,  మహేష్ సినిమా చేసుకుని త్రివిక్రమ్ నే బన్నీ ప్రాజెక్టు మీదకు వస్తారని తెలుస్తోంది. ఇది ఏప్రిల్ 2022 వేళకు వుంటుందంటున్నారు. పైగా యువసుధ వేసిన ట్వీట్ బాగానే వుంది కానీ దానికి కొరటాల లైక్ చేయడం కానీ రీట్వీట్ కొట్టడం కానీ చేయలేదు. దీనికి కూడా ఫ్యాన్స్ ఎత్తి చూపిస్తున్నారు. 

మొత్తం మీద పుష్ప విడుదల వేళకు కానీ ఈ విషయంలో ఓ క్లారిటీ రాకపోవచ్చు. ఏది ఏమైనా త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ – కొరటాలకు బన్నీ తాత్కాలికంగానైనా దూరం అయిన మాట వాస్తవం. కానీ ఈ ఇన్సిడెంట్ తో త్రివిక్రమ్ అటు మహేష్ కు, ఇటు బన్నీకి బాగా  దగ్గరయ్యారు.