Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంకెలు లేవు..రికార్డులే

అంకెలు లేవు..రికార్డులే

తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఒక్కటి అంటే ఒక్క ఏరియా అంకెలు బయటకు రావడం లేదు. కనీసం గ్యాసిప్ మాదిరిగా కూడా. కానీ బిబి 2 రికార్డు, నాన్ బిబి 2 రికార్డు అంటూ హడావుడి మాత్రం కనిపిస్తోంది. 

పవన్ వకీల్ సాబ్ సంగతే ఇది. ఈ సినిమా అంకెలు బయటకు రాకూడదని ముందుగానే తాళాలు వేసేసారు. వైజాగ్, గుంటూరు, కృష్ణ, నైజాం ఏరియాలు నిర్మాత దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అందువల్ల అక్కడ తాళాలు కాదు సీల్ నే పడిపోయింది.  

మిగిలిన ఏరియాలు కూడా దిల్ రాజుకు అత్యంత సన్నిహితులకే ఇచ్చారు. అందువల్ల అక్కడి నుంచి కూడా ఫిగర్లు బయటకు రావడం లేదు. కానీ చిత్రంగా ఏరియాల వైజ్ గా ఇంత వచ్చింది..అంత వచ్చింది అంటూ రోజూ సోషల్ మీడియా పోస్ట్ లు మాత్రం షురూ చేసేసారు. 

ఆ విధంగా రికార్డులు మాత్రం తయారయిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ అల వైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరు లాంటి సినిమాల ఫిగర్లు ఎప్పటికప్పుడు వచ్చాయి. అందువల్ల కొంతయినా క్లారిటీ వుంది. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరెవరో అంకెలు తెస్తున్నారు. వాటితోనే రికార్డులు అంటున్నారు.

నిజానికి కింద లెవెల్ చూస్తే కలెక్షన్లు యాభై శాతమే వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అంకెలు చూస్తే రికార్డులు దాటుతున్నాయి. ఇదంతా ఇలా వుంచితే ఆంధ్ర 45 కోట్ల మేరకు విక్రయించారు. కానీ ఇప్పటికి అరవై నుంచి డెభై శాతమే రికవరీ అయిందని టాక్ వుంది. 

రేట్లు తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ రేట్ల మీద రికవరీ కావాల్సి వుంది. అయితే అమ్మింది కేవలం ఈస్ట్, వెస్ట్, నెల్లూరు, సీడెడ్ మాత్రమే కాబట్టి దిల్ రాజుకు పెద్దగా సమస్య కాకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?