బ్రేకింగ్… విక్రమ్ కుమార్ కు బై బై?

కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ఎలాంటి డైరక్టర్ అయినా, గీతాఆర్ట్స్ దగ్గర, బన్నీ దగ్గర, రాజీ సమస్య వుండదు. కథ పక్కాగా రెడీ చేసి ఇవ్వాల్సిందే. ఓకె అనిపించుకోవాల్సిందే. అప్పుడే సినిమా…

కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ఎలాంటి డైరక్టర్ అయినా, గీతాఆర్ట్స్ దగ్గర, బన్నీ దగ్గర, రాజీ సమస్య వుండదు. కథ పక్కాగా రెడీ చేసి ఇవ్వాల్సిందే. ఓకె అనిపించుకోవాల్సిందే. అప్పుడే సినిమా స్టార్ట్ అయ్యేది. విక్రమ్ కే కుమార్ పెద్ద దర్శకుడే. వైవిధ్యమైన ఆలోచనలు చేయగలిగినవాడే. కానీ బన్నీకి పూర్తి సంతృప్తినిచ్చే కథను ఇవ్వలేకపోతున్నాడు.

ఓ కథ చెప్పాడు. సెట్ కాలేదు. కథమార్చాడు. లైన్ ఓకె అనిపించుకున్నాడు. కానీ తీరా చూస్తే విశ్రాంతి వరకు స్క్రిప్ట్ బాగానే కుదిరింది. సెకండ్ హాఫ్ ఓకె అనిపించుకోలేకపోతోంది. దాంతో బన్నీ ఇప్పుడు విక్రమ్ కుమార్ ను దాదాపు పక్కన పెట్టేసినట్లే అని తెలుస్తోంది. సెకండాఫ్ కుదిరితే అప్పుడు చూద్దాం అని షేక్ హ్యాండ్ ఇచ్చేసి పంపేసినట్లు వినిపిస్తోంది.

ఇక బన్నీకి మిగిలిన ఆశ అంతా త్రివిక్రమ్ పైనే. అరవింద సమేత వీరరాఘవ హిట్ అయితే త్రివిక్రమ్ తో వెళ్లాలని ఆశగా వున్నాడు. అందుకే బన్నీ తరువాత సినిమా ప్రకటన అక్టోబర్ 11 తరువాతే అని వినిపిస్తోంది. కానీ 11న ఏమవుతుందో చూడాలి. అప్పుడు బన్నీ డిమాండ్ కు త్రివిక్రమ్ తలొగ్గుతాడా? త్రివిక్రమ్ లైన్ లోకి బన్నీ వెళ్తాడా? అన్నది వుంటుంది.

ఏమైనా బన్నీ సినిమా కనీసం 2019లో నైనా వుంటుందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్టోబర్ లో ఫ్రాజెక్టు ఫైనల్ చేసుకున్నా, కథ, స్క్రిప్ట్ రెడీ కావాలంటే కనీసం ఆరునెలలు పడుతుందిగా? మొత్తానికి హీరోలు లేక నిర్మాతలు, డైరక్టర్లు కిందామీదా అవుతుంటే, కథలు, డైరక్టర్లు లేక బన్నీ అలా ఖాళీగా వున్నాడు.