ఫ్లాపులిచ్చిన డైరక్టర్లకు సినిమాలు

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ విజయాల వెనుక పరుగెడుతుంటుంది. కానీ ఒక్కోసారి వ్యవహారం చిత్రంగా వుంటుంది.  సక్సెస్ లు ఇచ్చిన డైరక్టర్ లు సినిమాల కోసం కిందా మీదా అవుతుంటారు. ఫెయిల్యూర్ లు ఇచ్చిన డైరక్టర్లకు…

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ విజయాల వెనుక పరుగెడుతుంటుంది. కానీ ఒక్కోసారి వ్యవహారం చిత్రంగా వుంటుంది.  సక్సెస్ లు ఇచ్చిన డైరక్టర్ లు సినిమాల కోసం కిందా మీదా అవుతుంటారు. ఫెయిల్యూర్ లు ఇచ్చిన డైరక్టర్లకు టక్కున సినిమాలు చేతికి అందేస్తుంటాయి. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరుశురామ్ మలి సినిమా ఇప్పటి దాకా రాలేదు. 

హను రాఘవపూడి, విక్రమ్ కుమార్, తేజ, సుధీర్ వర్మ వీళ్లంతా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఇచ్చిన దర్శకులు. వీళ్లు మంచి దర్శకులే. ఆరంభంలో. కానీ తరువాత మాత్రం వరుసగా ఫ్లాపులు ఇస్తూనే వస్తున్నారు. కానీ అవకాశాలు మాత్రం వెదుక్కుంటూ వస్తున్నాయి. 

బోలెడు ఫ్లాపుల తరువాత నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా అందించాడు తేజ. మళ్లీ ఆ వెంటనే మరో డిజాస్టర్ పలకరించింది. కానీ ఇప్పుడు అదే తేజ కు రెండు సినిమాల ఆఫర్ పలకరించింది. గోపీచంద్, రానాలతో సినిమాల వర్క్ ప్రారంభమైందని బోగట్టా.

విక్రమ్ కుమార్ కూడా అంతే, రెండు ఫ్లాపులకు తక్కువ యావరేజ్ లకు పక్కన అనే రెండు సినిమాలు అందించారు. ఇప్పుడు ఆయనను వెదుక్కంటూ ఒక సినిమా వచ్చినట్లు, ఓ యంగ్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

హనురాఘవపూడి సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్లు. కానీ ఇప్పడు ఆయన ఓ బహు భాషా సినిమాను తయారుచేసే పనిలో వున్నారు. స్వప్న సినిమాస్ పతాకంపై ఇది ముస్తాబవుతుంది. 

ఇక సుధీర్ వర్మ సంగతి తెలిసిందే. ఆయన ట్రాక్ రికార్డు కూడా అంతంత మాత్రమే. మంచి సినిమాలు అందిస్తారు. కానీ కమర్షియల్ సక్సెస్ లు పలకరించవు. ఆయనకు ఓ సినిమా వచ్చేసింది. సురేష్ బాబు, సునీత తాటి నిర్మించే రీమేక్ కు ఆయన దర్శకుడు.  

అలాగే సింగిల్శ్ ఫ్లాప్ లు ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల, శ్రీవాసు, కందిరీగ వాసు,లాంటి వాళ్ల సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి.

మరో 'సామజవరగమన' వస్తుందా?