ఈ మధ్య డిఫరెంట్ చిన్న సినిమాల పరిస్థితి భలేగా వుంది. ఆర్ ఎక్స్ 100 లాంటి చిన్న సినిమా పెద్ద విజయం సాధించేసరికి ఆ తరహా సినిమాలకు గిరాకీ పెరిగింది. భైరవ గీత అనే సినిమాను మూడుకోట్ల రేంజ్ లో అభిషేక్ పిక్చర్స్ టేక్ ఓవర్ చేసి పంపిణీ చేస్తోంది.
యుటర్న్ సినిమాను సీడెడ్ మినహా, ఆంధ్ర, నైజాంలకు తీసుకుని, రీ డిస్ట్రిబ్యూట్ చేసి, లాభం చేసుకున్న బయ్యర్ లు సురేష్ రెడ్డి అండ్ కో ఇప్పుడు మరో చిన్నసినిమాను టేకోవర్ చేసారు. నాటకం అనే సినిమాను కోటిన్నరకు ఆంధ్ర, సీడెడ్ , నైజాంలకు తీసుకున్నారు. పైగా సినిమా చూపించి మరీ అమ్మడం విశేషం.
ఇప్పుడు ఈ సినిమాకు రెండుకోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏరియాల వారీ అమ్మేయడం ప్రారంభమైపోయింది. ఇదిలావుంటే మారుతి కాంపౌండ్ లో కోటిన్నరతో తయారైన సినిమాకు మరో కోటిన్నర పబ్లిసిటీ, ఖర్చులు పెడుతూ పార్టనర్ గా చేసారు నిర్మాత రాథామోహన్.
అంటే ఈ సినిమాను ఇప్పుడు మూడుకోట్ల రేంజ్ దాటి మార్కెట్ చేయాలన్నమాట. మొత్తానికి డిఫరెంట్ చిన్న సినిమాలకు మళ్లీ టైమ్ వచ్చినట్లుంది.