కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి వచ్చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు సీఎం జగన్ తిరుగు ప్రయాణం అవుతారని మొదట ప్రకటించారు. అయితే సీఎం తిరుగు ప్రయాణం వాయిదా పడింది. మరింతమంది కేంద్రమంత్రులతో సమావేశం అవుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. కేంద్ర హంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ నేడు సమావేశం అవుతున్నారు.
ఈ సమావేశం మాత్రమే కాకుండా మరింతమంది కేంద్ర మంత్రులు, ప్రముఖులతో సమావేశం కావడానికి జగన్ సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఢిల్లీ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతూ ఉంది. అమిత్ షాతో సమావేశం సందర్భంగా జగన్ పలు అంశాలను ప్రస్తావించినట్టుగా మీడియాకు ప్రకటన ఇచ్చారు.
రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను అందులో పేర్కొన్నారు. ప్రత్యేకహోదా అంశం దగ్గర నుంచి, దిశ చట్టం వరకూ రకరకాల అంశాలను అమిత్ షా దృష్టికి జగన్ తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రవిశంకర్ ప్రసాద్ తో భేటీ విషయంలో శాసనమండలి రద్దు, కర్నూలుకు హై కోర్టు తరలింపు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.