పవన్ కే బాగా అర్థం అయింది

బ్రో సినిమా ఫలితం ఎవరికి అర్థం అయినా కాకున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బాగా అర్థం అయినట్లే కనిపిస్తోంది. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం అయింది.  Advertisement త్రివిక్రమ్ సెట్…

బ్రో సినిమా ఫలితం ఎవరికి అర్థం అయినా కాకున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బాగా అర్థం అయినట్లే కనిపిస్తోంది. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం అయింది. 

త్రివిక్రమ్ సెట్ చేసిన సినిమాల్లో ఎక్కడ తేడా జరిగిందో అర్థం అయినట్లే వుంది. సూక్ష్మంలో మోక్షం సాధ్యం కాదని, అంచెలంచెల మోక్షమే సాధ్యమని బాగానే తత్వం బోధపడినట్లు వుంది. తక్కువ రోజుల పని, ఎక్కువ పారితోషికం అనే త్రివిక్రమ్ ఫార్ములా వికటించింది. అందుకే పవర్ స్టార్ అర్జంట్‌గా మైత్రీ మూవీస్ కు కబురు వెళ్లింది. జస్ట్ చిన్న షెడ్యూలు చేసి పక్కన పెట్టిన తెరి రీమేక్ ఉస్తాద్ సినిమాను బయటకు తీయించారు.

వీలయినంత మేరకు తగ్గించి తన వర్కింగ్ డేస్ ఎన్ని అవసరం పడతాయో, షెడ్యూలు వేసి ఇవ్వమని పవన్ దగ్గర నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు ఆ లెక్కలు కడుతున్నారు. ఓ పాట కట్ చేసి, కనీసం 60 రోజులు అవసరం పడతాయని లెక్కలు కడుతున్నట్లు తెలుస్తోంది. అలా అయిన పక్షంలో పవన్ కనుక సెప్టెంబర్, అక్టోబర్ నెలలు డెడికేషన్‌గా కేటాయిస్తే సినిమాను సంక్రాంతి పండగ వేళకు కాస్త అటు ఇటుగా రెడీ చేయచ్చు.

పవన్ కు ఇప్పుడు ఓ మాంచి మాస్ సినిమా కావాలి. ఎన్నికల ముందు జనాలను, ఫ్యాన్స్ ను ఉర్రూత లూగించే సినిమా కావాలి. త్రివిక్రమ్ సెట్ చేసే బ్రో లాంటి సినిమా కాదు. గబ్బర్ సింగ్ లాంటి మాస్ సినిమా. అందుకే ఉస్తాద్ మీదకు మళ్లింది దృష్టి. చెడడం కూడా ఓ మంచికే అన్నట్లుగా మారింది.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాల ద్వారా పక్కకు వెళ్లిపోయారు పవన్. ఈ సూక్ష్మంలో మోక్షం అనే పద్దతి త్రివిక్రమ్ సూచించారో, పవన్‌కు నచ్చిందో మొత్తానికి వికటించిన మాట వాస్తవం. ఇకపై ఇలాంటి ప్రాజెక్టులు చేయకపోవచ్చు.