తమ ప్రేమ కథ ఐదేళ్లను పూర్తి చేసుకుందని ప్రకటించాడు విఘ్నేష్ శివన్. వేలంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమ విషయం గురించి ఇతడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నయనతారతో సన్నిహితంగా ఉన్న ఫొటోను పోస్టు చేసి.. ఐదేళ్ల బ్యూటిఫుల్ మొమెంట్స్ గురించి ప్రస్తావించాడు. ఇప్పటికే వీరి ప్రేమకథ ఓపెన్ గానే సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఆనందకరమైన సందర్భాన్నీ వీళ్లిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇటీవలే దేవాలయల సందర్శన కూడా చేశారు. ఇక పెళ్లే అనే వార్తలు వచ్చాయి.
నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి గురించి ఇప్పటికే చాలా సార్లు ఊహాగానాలు, వార్తలు వినిపించాయి. అలాగే బ్రేకప్ ఊహాగానాలు కూడా! వీరిద్దరి బ్రేకప్ అయిపోయిందని కూడా రకరకాల సందర్భాల్లో మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే వీరి పెళ్లీ జరగలేదు, బ్రేకప్ కూడా జరగలేదు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి!
తమ ప్రేమలో ఐదో వేలంటైన్స్ డేను జరుపుకుని ఈ జంట తమ బంధాన్ని చాటుకుంటూ ఉంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలపు ప్రేమకథలు ఉండవు. కొన్ని ప్రేమలుగా మారి, వెంటనే పెళ్లి అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి కొన్ని సంవత్సరం, రెండేళ్ల తర్వాత బ్రేకప్ దిశగా సాగుతూ ఉంటాయి. నయనతార ఇది వరకటి ప్రేమకథలు కూడా రెండు మూడేళ్ల వ్యవధిలోనే సాగాయి. ఈ ప్రేమ కథ మాత్రం ఐదేళ్లుగా సాగుతూనే ఉందని వారే ప్రకటించుకున్నారు. గ్రేటే!