‘నిప్పు’ లాంటి బుకాయింపు.. టీడీపీకి ఏంటి సంబంధం.?

సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి దగ్గర పర్సనల్‌ సెక్రెటరీగా పనిచేసిన వ్యక్తిపై ఐటీ సోదాలు జరిగితే.. ఆ సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయని స్వయానా ఐటీ శాఖ ప్రకటిస్తే, టీడీపీకి…

సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి దగ్గర పర్సనల్‌ సెక్రెటరీగా పనిచేసిన వ్యక్తిపై ఐటీ సోదాలు జరిగితే.. ఆ సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయని స్వయానా ఐటీ శాఖ ప్రకటిస్తే, టీడీపీకి అస్సలేమాత్రం సంబంధం లేని వ్యవహారమట. ఓ టీడీపీ ముఖ్య నేతకు సంబంధించిన ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, టీడీపీకి చెందిన కొందరు నేతలు పూర్తిగా ఈ ఎపిసోడ్‌లో కార్నర్‌ అయిపోయారు.

‘ఓ ప్రముఖుడి వద్ద పీఎస్‌గా పనిచేసిన వ్యక్తి..’ అంటూ ఐటీ శాఖ, ప్రెస్‌ నోట్‌లో పేర్కొంది. మొత్తంగా 2 వేల కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాలు ప్రాథమికంగా వెలుగు చూసినట్లు ఆ ప్రెస్‌ నోట్‌లో ఐటీ శాఖ స్పష్టం చేసిన తర్వాత, ఇంకా ఈ బుకాయింపులేమిటి.? టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అయితే, ‘ఎవరి మీదనో ఐటీ దాడులు జరిగితే.. వాటిని టీడీపీకి అంటగడతారా.?’ అంటూ అగ్గిమీద గుగ్గిలమైపోయారు.

ఓటుకు నోటు కేసు సందర్భంలోనూ టీడీపీ బుకాయింపులు ఇలాగే సాగాయి. ఈ వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ చంద్రబాబే. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. అయితే, ఆ కేసు నుంచి అప్పట్లో చంద్రబాబు సులువుగానే తప్పించుకోగలిగారనుకోండి.. అది వేరే విషయం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ఈసారి తప్పించుకునే అవకాశాలు దాదాపుగా కన్పించడంలేదు. నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా, వైఎస్‌ జగన్‌ మీద ఆరోపణలు చేస్తూ.. తమ మీద వచ్చిన ఆరోపణలపై బుకాయించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ బుకాయింపులు నవ్వులపాలైపోతున్నాయనుకోండి.. అది వేరే విషయం.

ప్రతి చిన్న విషయానికీ మీడియా ముందుకొచ్చేసి తాను నిప్పులాంటోడిననీ, నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ ఆరోపణలు ఎదుర్కోలేదనీ చెబుతుంటారు ‘నిప్పు’ నారా చంద్రబాబునాయుడు. ఇంతకీ, ఇప్పుడాయన ఎక్కడ.? ఓటుకు నోటు కేసులో ఎవరిపై ఆరోపణలు వచ్చాయి.? స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి వేసిన అక్రమాస్తుల కేసులో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైనమేంటి.? ఇప్పుడు ఈ ఐటీ సోదాల వ్యవహారమేంటి.?

కాస్త మనసు కుదుటపడ్డాక.. బుకాయింపుల కోసం పక్కాగా ప్రిపేర్‌ అయ్యాక.. చంద్రబాబు ఖచ్చితంగా మీడియా ముందుకొస్తారు. ఈలోగాన, చంద్రబాబు తరఫున ‘నిప్పు’ లాంటి బుకాయింపులతో మీడియా ముందు టీడీపీ నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ కంగారులోనే, తాము దొరికిపోయిన వైనాన్ని టీడీపీ నేతలు బయటపెట్టుకుంటుండడం కొసమెరుపు.

రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది డైలీ